అన్నానగర్: దిండుక్కల్ రైల్వే కాలనీ, బ్రిడ్జ్ సర్వీస్ రోడు సమీపంలో సెయింట్ ఆంథోనీ ఆలయం ఉంది. గురువారం ఉదయం గుడి దగ్గర ఓ పాప ఏడుపు వినిపించింది. అప్పుడు ఆ దారిలో రైల్వేస్టేషన్‌కు వచ్చిన జనం ఇది చూసి షాక్ అయ్యారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ట్రాఫిక్ సబ్–ఇన్‌స్పెక్టర్ విఘ్నేశ్వరన్ అక్కడికి వచ్చి చూశాడు. బొడ్డు తాడుతో పసికందు ఏడుస్తూ ఉండటాన్ని చూసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. అనంతరం 108 సిబ్బంది పసికందును రక్షించి ఇంక్యుబేటర్‌లో ఉంచి దిండిగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ శిశు సంరక్షణ విభాగంలో చిన్నారికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. కాగా బిడ్డను విడిచిన కసాయి తల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హత్యకేసులో ఐదుగురి అరెస్టు
అన్నానగర్: తిరుచ్చి సంజీవినగర్ వడమల్లి వీధికి చెందిన కామాక్షి(52)కి కుమారుడు గుణశేఖరన్(34), కోడలు సులోచన(30) ఉన్నారు. గుణశేఖరనన్‌కు తాగుడు అలవాటు ఉంది. రోజూ మద్యం మత్లులోతల్లి, భార్యతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా గుణశేఖరన్ ఎప్పటిలాగే మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లి, భార్యతో గొడవ పడ్డాడు. తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. కొద్దిసేపటి తర్వాత గుణశేఖరన్ అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని తల్లి, భార్య సమీపంలోని ప్రైవేట్ మెడికల్ క్లినిక్‌కి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కోటై పోలీసులు గుణశేఖరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో గుణశేఖరన్‌ను ఖాళీ సిరంజిలో గాలి నింపి ఇంజక్షన్ చేసి, గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. అనంతరం హత్య కేసు నమోదు చేసి తల్లీ, కోడళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో కామాక్షికి పూజారి వీధికి చెందిన విజయకుమార్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఈమె బంధువులు విక్కీ అనే నిత్యాశ్రీ, కుపేద్రన్ అనే నెల్పియా(19) హిజ్రాలు. ఈ ముగ్గురి వద్ద కొడుకు రోజూ మద్యం తాగి వచ్చి మద్యం మత్తులో తనను, తన కోడలిపై దాడి చేసి వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో వారంతా కలసి గదిలో పడి ఉన్న గుణశేఖరన్ శరీరంలోకి ఖాళీ సిరంజి ఇంజెక్ట్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు గుణశేఖరన్ మెడను బిగించి హత్య చేశారు. దీంతో పోలీసులు వివాహేతర ప్రియుడు తల్లి, భార్య సహా ఐదుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
అన్న అంత్యక్రియలకు
వెళ్లి తిరిగి వస్తూ...
తిరువొత్తియూరు: అన్న అంత్యక్రియలకు వెళ్లి తి రిగి వస్తున్న మార్గంలో రోడ్డు ప్రమాదంలో మురుగునీటి కాలువలో కారు దూసుకు వెళ్లి మహిళ మృతి చెందింది. చైన్నె అశోక్‌నగర్‌కు చెందిన శిలువై మేరీ(65) అన్న శౌరిముత్తు(80). కల్ల కురిచ్చి జిల్లా ఉలందరూపేట సమీప గ్రామంలో బుధవారం మృతి చెందాడు. ఇతను అంత్యక్రియలకు చైన్నె నుంచి శిలువై మేరీ, ఆమె బంధువులు సెల్వరాజ్ , అరుల్ దేవకుమార్, విక్టోరియా, ఆరోగ్య సెల్వి తదితరులు ఒకే కారులో బయల్దేరారు. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. తర్వాత కారులో తిరిగి వస్తున్నారు విల్లుపురం జిల్లా దండివనం సమీపంలోని చలువాది కూటురోడ్డు వద్ద రాత్రి 9 గంటల సమయంలో వస్తుండగా రోడ్డు పక్కన రోడ్డు మురుగునీటి కాలువలోకి కారు దూసుకెళ్లింది. నీటిలో కారు మునిగిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అందరూ కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో శిలువై మేరీ మృతి చెందారు. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు.
107 ఏళ్ల వృద్ధురాలు మృతి
కొరుక్కుపేట: కడలూరు జిల్లాకు చెందిన 107 ఏళ్ల వృద్ధురాలు కావేరి అమ్మాళ్ గురువారం మృతి చెందారు. వివరాలు.. కడలూరు భువనగిరి చిన్న దే వాంగర్ వీధికి చెందిన వెంకటేశం భార్య కావేరి అమ్మాళ్ (107). ఈమె భర్త గతంలో చనిపోయా రు. వీరికి కుమారుడు మత్తుకుమారస్వామి, కు మార్తె ప్రేమ ఉన్నారు. ముత్తుకుమారస్వామికి ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నా రు. కుమార్తె ప్రేమకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఐదు తరాలను చూసి న కావేరి అమ్మాళ్ ఆరోగ్యం దెబ్బతినడంతో 107 వ సంవత్సరంలో మరణించారు. ఆమె మృతదేహానికి కుమారుడు, కుమార్తె, మనవళ్లు, స్థానికు లు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment