మహిళల మద్దతు.. విజయ్‌కే !
● సర్వేతో వెలుగులోకి.. ● 37 శాతం ఓటుబ్యాంక్‌కు అవకాశం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికళగంకు మద్దతుగా మహిళా లోకం గళాన్ని వినిపిస్తోంది. 76.67 శాతం మంది తమ ఓటు విజయ్‌కే అంటూ స్వరాన్ని వినిపించి ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించారు. గతనెల విల్లుపురం జిల్లా విక్రవాండి వేదికగా బ్రహ్మాండ మహానాడుతో ప్రజలలోకి తన సిద్ధాంతాలను తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో రాజకీయ పయనం ఇంకా వేగంపుంజుకోలేదు. పార్టీ జిల్లాల కార్యదర్శుల నుంచి బూత్ కమిటీల వరకు ఎంపిక కసరత్తు జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విజయ్‌కి మద్దతు ప్రజలలో ఏ మేరకు ఉందో ఓ ప్రముఖ వార పత్రిక సర్వే చేసింది. గత నెలా వారం పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ సర్వే వివరాలను మంగళవారం ప్రకటించారు.
విజయ్ వైపే చూపు..
2026లో అసెంబ్లీ విజయ్ పార్టీకి ఓటు వేస్తారా? అని ప్రశ్నకు పురుషుల్లో 63.50 శాతం, సీ్త్రలలో 76.67 శాతం మంది అవునని సమాధానం ఇవ్వడం విశేషం. అలాగే అధికారంలో వాటా అన్న విజయ్ ప్రకటన గురించిన ప్రశ్నకు ఇది సరైన నిర్ణయం అని 74.92 శాతం మంది పురుష ఓటర్లు, 80.01 శాతం సీ్త్ర ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. విజయ్ రూపంలో ఎవరికి నష్టం? అన్న ప్రశ్నకు డీఎంకేకే అధికం అని, ఆ తర్వాత సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చికి అంటూ మెజారిటీ శాతం మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విజయ్ ఒంటరిగా పోటీ చేయాలంటూ 43 శాతం మంది పురుషులు, 45 శాతం మహిళా ఓటర్లు పిలుపు నివ్వడం గమనార్హం.
బాధితులకు ఆపన్న హస్తం
చైన్నెలోని టీపీ ఛత్రంలో వర్షం కారణంగా ముంపును ఎదుర్కొన్న 250 మంది కుటుంబాలను ఆదుకునేందుకు విజయ్ నిర్ణయించారు. వీరందరినీ మంగళవారం బస్సుల ద్వారా పనయూరులోని తనకార్యాలయానికి పిలిపించారు. వారికి సహాయకాలను పంపిణీ చేశారు. వారి సమస్యలను విన్నారు. ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment