శబరిమలైకు వెళ్లే భక్తులు సమయాన్ని పాటించాలి
సేలం: శబరిమలైకు ఇదివరకే రిజిస్టర్ చేసి సమయంలోనే వెళితే, శ్రమ పడకుండా స్వామి దర్శనం చేసుకోవచ్చని రాష్ట్ర భక్తులకు డీజీపీ శంకర్ జివాల్ సూచించారు. అనవసర రద్దీని నివారించే రీతిలో తమిళనాడు నుంచి శబరిమలైకు వెళ్లే భక్తులకు డీజీపీ శంకర్ జివాల్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. శబరిమలైలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. భక్తుల రద్దీని నివారించడానికి దర్శనం కోసం డిజిటల్ రిజర్వేషన్ చేసుకోవాలని తెలిపారు. వారి కోసం కేటాయించబడిన సమయాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. తద్వారా శబరిమలైలో అధిక రద్దీని నివారించచ్చని కేరళ పోలీసు శాఖ తెలిపిందన్నారు. శబరిమలైలో ఆదివారం వరకు 11.12 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారన్నారు. గత 15వ తేది నుంచి 1.95 లక్షల మంది తమకు కేటాయించిన సమయం కంటే ముందుగానో, తర్వాతనో వచ్చినట్టు తెలిసిందన్నారు. కేటాయించిన సమయాన్ని పాఠించకుండా దర్శనానికి వచ్చే వారి సంఖ్య గత 15వ తేది నుంచి అధికవుతుండడాన్ని ఇది చూచిస్తున్నట్టు తెలిపారు. కనుక తగిన సమయంలో భక్తులు తాము రిజర్వేషన్ చేసుకున్న ప్రకారం. వారికి కేటాయించిన సమయానికి మాత్రమే శబరిమలైకు వచ్చినట్లయితే ఎలాంటి శ్రమ లేకుండా స్వామిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చునని కేరళ రాష్ట్ర పోలీసు శాఖ డిమాండ్ చేస్తుందని తెలిపారు. కనుక రాష్ట్ర నుంచి శబరిమలైకు వెళ్లే భక్తులు అందరూ తప్పక సమయాన్ని పాఠించాలి శంకర్ జివాల్ సూచించారు. 18 మెట్ల వద్దకు చేరుకోవడానికి వరసను పాటించాలని, పంబ నుంచి సన్నిధానికి వెళ్లే భక్తుల రద్దీని గమనించి అందుకు తగినట్టుగా వెళ్లాలని, ఉచిత సహాయ నెంబరు 14432ను ఉపయోగించి ఎలాంటి సహాయాన్ని అయినా పొందవచ్చి వంటి 17 సూచనలను శంకర్ జివాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment