మృతుల కుటుంబాలకు ఓదార్పు
వేలూరు: తుపాను బాధితులందరికీ పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తిరువణ్ణామలైలో కొండ చరియలు విరిగి పడి ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ధర్మపురి జిల్లాలో వరద బాదితులను పరామర్శించిన ఆయన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తిరువణ్ణామలై చేరుకొని మట్టి చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని నేరుగా వెల్లి పరిశీలించారు. అనంతరం కొండ కింద ప్రాంతాల్లోని వారిని సంరక్షణా స్థలంలో ఉంచారా? అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మృతుల బందువులను నేరుగా వెల్లి చూసి ఓదార్చారు. అనంతరం వరదల వల్ల ప్రత్యేక మండపంలో ఉంచిన వారిని పరామర్శించి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment