అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం
తిరుత్తణి: డాక్టర్ అంబేడ్కర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై రాజకీయ పార్టీలు సహా వివిధ సంస్థలు గురువారం ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. తిరుత్తణిలోని చైన్నె బైపాస్ రోడ్డులో దళిత ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు న్యాయవాది తిరునావుక్కరసు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశాయి. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు దళిత ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆరు గజేంద్ర సహా పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద తమిళ దేశీయ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆసై దివాకర్ ఆధ్వర్యంలో అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, నిర్వాహకులు జీవ, కరుణ, దివాకర్, కేశవన్ పాల్గొన్నారు.
డీఎంకే, వీసీకే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
తిరువళ్లూరు: డాక్టర్ అంబేడ్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాను ఖండిస్తూ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో డీఎంకే వీసీకే, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన ఆందోళనకు డీఎంకే జిల్లా కన్వీనర్ తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ నేతృత్వం వహించారు. రైల్వేస్టేషన్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనకు పొన్నేరి ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఆవడిలో మంత్రి నాజర్, గుమ్మిడిపూండిలో ఎమ్మెల్యే టీజే గోవిందరాజన్, మధురవాలయ్‌లో ఎమ్మెల్యే కారపాక్కం గణపతి, అంబత్తూరులో ఎమ్మెల్యే జోసెఫ్‌సామ్యూల్, పూందమల్లిలో ఎమ్మెల్యే కృష్ణస్వామి పాల్గొన్నారు. అదేవిధంగా వీసీకే ఆధ్వర్యంలో ఆయిల్ మిల్ వద్ద జరిగిన ఆందోళనలో అమిత్‌షా దిష్టబొమ్మను దహనం చేశారు.
వేలూరులో..
వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లోను పార్టీ డీఎంకే శ్రేణులు ధర్నా నిర్వహించారు. కాట్పాడి–చిత్తూరు బ స్టాండ్‌లో డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి వన్నియరాజ, కార్పొరేటర్‌లు పాల్గొన్నారు. అనకట్టు నియోజకవర్గంలో డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే నందకుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వేలూరులో ఎమ్మెల్యే కార్తికేయన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకా రామన్, ఉపాధ్యక్షుడు పీపీ చంద్రప్రకాష్, ఎస్సీ ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్, యువజన విభాగం పట్టణ కార్యదర్శి రఘు, జార్జ్, కార్యకర్తలు మకాన్ సిగ్నిల్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment