మహిళల్లో చైతన్యమే ధ్యేయం
సాక్షి, చైన్నె : మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత కల్పించే దిశగా, ఈ రంగంలోకి మహిళలకు ప్రోత్సాహం, చైతన్యం కల్పించడమే ధ్యేయంగా కార్యక్రమాలను విస్తృతం చేశామని ఫిక్కీ మహిళా విభాగం చైర్‌పర్సన్ దివ్య అభిషేక్ తెలిపారు. చైన్నె రాజలక్ష్మి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో షీ రైజెస్ కాన్ క్లేవ్ 2024 కార్యక్రమం గురువారం జరిగింది. చైతన్య వంతమైన సింపోజియం, వ్యవస్థాపక ఆశయాలను ప్రేరేపించడం, శక్తివంతంగా చేయడం, ఆవిష్కరణలు, నాయకత్వం, వ్యవస్థాపకత అంశాలపై ఇందులో చర్చించారు. ఫిక్కీ మహిళా విభాగం చైర్ పర్సన్ దివ్య అభిషేక్ మాట్లా డుతూ, మహిళా పారిశ్రామిక వేత్తలకు సాధికారత లక్ష్యంగా, విజ్ఞానం, , ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించే వేదికగా ఈ కార్యక్రమం నిలిచిందన్నారు. స్టార్టప్ వర్టికల్ ద్వారా అవకాశాలను వివరించారు. మహిళా వ్యాపారా వేత్తల అద్బుతమైన సామర్థ్యాలను ప్రదర్శించే అవకావం దక్కిందన్నారు. ఉజ్వల భవిష్యత్తును నిర్మించడం, మార్గదరకత్వం, సహకారంలో ఎల్లప్పుడు ముందుంటామన్నారు. న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకుడు శివరాజా రామనాథన్, తమిళనాడు స్టార్టప్ , ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ జీఎస్‌కే వే లులు హాజరై మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను , వారి కలలను సాకారంచేయడం, లక్ష్య చేదనను గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment