రైల్వేస్టేషన్‌లో తనిఖీలు ముమ్మరం
తిరువళ్లూరు: రిపబ్లిక్ డే సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఆదివారం రిపబ్లిక్ డే వేడుకలను తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనీఖీలను ముమ్మరం చేశారు. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల వద్ద క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. ప్రయాణికుల వద్ద బ్యాగులను సైతం తనీఖీ చేశారు. దీంతో పాటు అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని కోరుతూ పోలీసులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో పాటు కడంబత్తూరు, సెవ్వాపేట, తిరునిండ్రవూర్, ఆవడితోపాటు ఇతర రైల్వేస్టేషన్‌లలోనూ తనీఖీలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment