వంశపారంపర్యంపై అవగాహన ప్రదర్శన
తిరుత్తణి: పారంపర్య జీవన శైలిపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నిర్వహించిన ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. తిరుత్తణి సమీపం కేజీ.కండ్రిగలోని చార్లెస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పారంపర్య జీవన విధానానికి సంబంధించి ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చార్లెస్ డేవిడ్ ఇమాన్యుయేల్ అధ్యక్షత వహించారు. ప్రధానోపాధ్యాయురాలు అమలి ఉమారాణి స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా రైతులు కుమార్, వెట్రి, లింగమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన పారంపర్య జీవన శైలిపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా వ్యవసాయం, ఆహారం, క్రీడలు, నాట్యం, వైద్యం, కళలకు సంబంధించిన ప్రదర్శన విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న మన దేశంలో పండే పంటలు, ఆహార ఉత్పత్తులకు సంబంధించి రైతులు అవగాహన కల్పించారు. ప్రకృతి సిద్ధంగా సాగు చేసే పంటలకు పెరుగుతున్న ఆదరణపై యువరైతు లింగమూర్తి అవగాహన కల్పించారు. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment