![Man Collapsed Sudden Heart Attack at Wedding Rituals At Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/23/old-city.jpg.webp?itok=VXugmtWV)
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వివరాలు.. పాతబస్తిలోని కాలాపత్తార్‌లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని వరుడిని ముస్తాబు చేస్తన్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి.. అతడి పాదాలకు పసుపు రాస్తుండగా ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలాడు. వెంటనే గమనించిన బంధువులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్థారించారు.
ఊహించని ఘటనలో పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి. రబ్బాని మరణంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిన దృశ్యాలను బంధువులు ఫొన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్స్ సైతం భయందోళనలకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment