సాక్షి, హైదరాబాద్ : కరోనా పరిస్థితుల మధ్య సినిమా షూటింగ్స్‌కి సంబంధించి పలువురు నిర్మాతలతో టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యంగా షూటింగ్ లొకేషన్లపై ప్రముఖంగా చర్చ జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 'తెలంగాణలో షూటింగ్‌కి సంబంధించిన అనేక ప్రాంతాలున్నాయి. ఆదిలాబాద్, వికారాబాద్, కుంతలా, భోగతా జలపాతాలు వంటి దాదాపు 50-60 లొకేషన్లు తెలంగాణలోనే ఉన్నాయి. ఇక్కడ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో షూటింగ్స్‌కి సంబంధించిన నివేదికను 15 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందిస్తాం' అని తెలిపారు. (‘మీర్జాపూర్-2’ రిలీజ్ ఎప్పుడంటే..)
కరోనా నేపథ్యంలో ఇతర దేశాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని పలువరు ప్రముఖులు ఇటీవల మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లోనే మంచి లొకేషన్లు ఉన్నాయని, అంతేకాకుండా వీటి వల్ల బడ్జెట్ కూడా తగ్గుతుందని పలువరు నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలోని లొకేషన్స్‌ని పరిశీలించి సినీ ప్రముఖులు త్వరలోనే కేటీఆర్‌తో మరోసారి సమావేశం కానున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం షూటింగులకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ ఉన్నవి, చిన్న సినిమాలు షూటింగ్స్ మొదలుపెట్టాయి. ప్రస్తుతం పెద్ద సినిమాల షూటింగ్‌లు సైతం సెప్టెంబరు నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి. (సుశాంత్ ఫ్లాట్‌లో డమ్మీ టెస్ట్ నిర్వహించిన సీబీఐ)
Comments
Please login to add a commentAdd a comment