కార్యక్రమంలో మాట్లాడుతున్న అశోక్ దల్వాయి
ఏజీ వర్సిటీ: వ్యవసాయ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే అద్వితీయ శక్తిగా ఎదిగిందని, ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కోవాలని నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ దల్వాయి పేర్కొన్నారు. జయశంకర్ వ్య వసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రాన మీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదో అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ సదస్సు ముగింపు సమావేశం శనివారం జరిగింది. వ్యవసాయం, దేశ రక్షణ రంగాల పరిశోధనలో హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ హబ్ అని అభివర్ణించారు.
వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికత ఇంకా క్షేత్రస్థాయికి పూర్తి స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు. ఆహార, పౌష్టికాçహారం భద్రతతో పాటు వ్యవసాయం వల్ల పర్యావరణానికి ఎదరవుతున్న సవాళ్లను పరిష్కరించడంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని పేర్కొన్నారు. మున్ముందు అందుబాటు లో ఉన్న పరిమిత భూ వనరుల్లోనే వ్యవసాయం కొనసాగిం చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు.
ఐసీఏఆర్ డీడీ ఏకే సింగ్ మాట్లాడుతూ.. వీసీ ప్రవీణ్‌రావు నేతృత్వంలో వ్యవసాయ వర్సిటీ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. సమాజంలో సరైన కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలని, రైతుల పట్ల ప్రోయాక్టివ్‌గా ఉండాలని ఏకే సింగ్ సూచించారు. వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే పెద్ద ఎత్తున అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment