అస్తవ్యస్తంగా ప్రభుత్వ బడుల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తంగా ప్రభుత్వ బడుల నిర్వహణ

Published Sun, Oct 20 2024 2:16 AM | Last Updated on Sun, Oct 20 2024 2:16 AM

అస్తవ

● పైసా విదల్చని కూటమి ప్రభుత్వం ● పేద పిల్లలపై చిన్నచూపు ● మధ్యాహ్న భోజన మెనూపైనా అలసత్వమే ● ఇష్టారాజ్యంగా భోజన కార్మికుల తొలగింపు ● ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూసిన నిజాలు

ప్రభుత్వ బడులపై చిన్నచూపు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నాడు– నేడు పథకాన్ని అటకెక్కించేసింది. నాణ్యమైన మెనూను నామరూపాలు లేకుండా చేసింది. నీళ్లసాంబారు, ఉడికీ ఉడకని అన్నం, కూరలు తినలేక విద్యార్థులను అవస్థలపాలు చేస్తోంది. మరుగుదొడ్ల నిర్వహణకు పంగనామాలు పెట్టింది. తల్లికి వందనమంటూ జబ్బలు చరిచి చేతులు పైకెత్తేసింది. మద్యంపై ఉన్న శ్రద్ధ.. చదువుపై లేకపోవడం పలువురిని తల్లిదండ్రులను విస్మయానికి గురిచేస్తోంది.

కార్మికుల తొలగింపు

జిల్లా వ్యాప్తంగా వంట కార్మికులు, సహాయకులు, పారిశుద్ధ్య కార్మికులు (ఆయాలు), వాచ్‌మెన్‌లు ఉన్నారు. వీరికి జూలై నుంచి జీతాలు ఇవ్వడం లేదు. వీరిలో గత ఐదేళ్లుగా పనిచేసే వారున్నారు. 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను తీసి వేసేందుకు ప్రధానోపాధ్యాయుల చేత ఒత్తిళ్లు చేస్తున్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బెదిరింపులకు దిగుతున్నారు. నయానో భయానో బెదిరించి ఇందులో కొంత మంది కార్మికులను తొలగించారు.

తిరుపతి ఎడ్యుకేషన్‌: గడిచిన ఐదేళ్ల కాలంలో పురోగతి దిశగా అడుగులు వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వ బడులు నేటి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో తిరోగమనం బాట పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుకాగానే సర్కారు స్కూళ్లు వారి అనుసరుల కనసన్నల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, ఆయాలను తప్పించి తమకు కావాల్సిన వారిని నియమించుకుంటున్నారు. అవకాశం ఉన్న చోట ల్లా తమకు అనుకూలమైన వారికి కొలువులు ఇప్పించి ఇదివరకున్న వారిని ఇంటికి పంపించేస్తున్నారు. కొలువులు ఇప్పించడంలో ఉన్న శ్రద్ధ పాఠశాలల శుభ్రత, నిర్వహణపై ఉండడంలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

కాలం చెల్లిన చిక్కీలు.. నాసిరకం గుడ్లు

ప్రస్తుత ప్రభుత్వం మధ్యాహ్నభోజన పథకం పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా నామకరణం చేసింది. శనివారం వివిధ మండలాల్లో కాలం చెల్లిన చిక్కీలు, మురిగిన నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేయడం .. విద్యార్థులు ఇంటి వద్ద నుంచి క్యారేజీలు తెచ్చుకోవడం కనిపించింది. మధ్యాహ్న భోజనం వండే వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఉపాధ్యాయులు సైతం వారిని ప్రశ్నించే సాహసం చేయడం లేదు. టాయ్‌లెట్లకు చాలా చోట్ల తాళాలు వేసి ఉండడం, అపరిశ్రుంగా ఉండడం కనిపించింది. ఆర్వో వాటర్‌ ప్లాంట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోని పరిస్థితి.

గతంలో రేషనలైజేషన్‌...ఇప్పుడు సర్దుబాటు

గతంలో టీడీపీ సర్కారు రేషనలైజేషన్‌ పేరుతో అనేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. అదే ధోరణితో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియను అమలు చేసి గందరగోళం సృష్టించింది. ఇష్టానుసారంగా జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌లు, ఎస్జీటీ కేడర్‌లో వందలాది మందిని సర్దుబాటు చేసింది. దీనికారణంగా దగ్గర్లో ఉన్న ఉపాధ్యాయులను 50 కి.మీ నుంచి 100 కి.మీ దూరం పంపించినట్లు తెలుస్తోంది. దాని వల్ల కౌన్సెలింగ్‌లో వారు కోరుకున్న పాఠశాలను కాదని రేషనలైజేషన్‌న్‌ పేరుతో దూర ప్రాంతాలకు పంపించింది. సెకండరీ గ్రేడ్‌ పాఠశాలల్లో 1:30 నిష్పత్తి ప్రకారం ఎక్కువ మంది టీచర్లు ఉంటే వారిని హైస్కూల్‌లో సబ్జెక్టు టీచర్లగా వర్క్‌ ఎడ్జస్ట్‌మెంట్‌ కింద పంపించింది. ఇలా ఇష్టానుసారంగా సర్దుబాటు ప్రక్రియ చేయడంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది.

మెనూ మార్పునకు రంగం సిద్ధం

విద్యార్థులకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించింది. ఏటా మెనూలో మార్పులు తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో రుచి తగ్గిపోయింది. మెనూ ప్రకారం ఆహారం అందడం లేదు. మధ్యా హ్న భోజనం తయారు చేసే కార్మికులకు, ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. మెనూ మార్పునకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ అధికారుల నుంచి నివేదికలు సైతం వెళ్లాయి.

జిల్లా సమాచారం

యాజమాన్యం పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య

ప్రాథమిక 1,817 47,998 ప్రాథమికోన్నత 194 13,983

ఉన్నత 323 74,689

మొత్తం 2,334 1,36,695

No comments yet. Be the first to comment!
Add a comment
అస్తవ్యస్తంగా ప్రభుత్వ బడుల నిర్వహణ 
1
1/1

అస్తవ్యస్తంగా ప్రభుత్వ బడుల నిర్వహణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement