తప్పుకుంటావా.. దుకాణం అప్పగిస్తావా? | - | Sakshi
Sakshi News home page

తప్పుకుంటావా.. దుకాణం అప్పగిస్తావా?

Published Mon, Oct 21 2024 12:20 AM | Last Updated on Mon, Oct 21 2024 1:53 PM

-

చిల్లకూరు: ‘నువ్వు మమ్మల్ని కాదని ఎక్కడ మద్యం దుకాణం నిర్వహిస్తావో చూస్తాం. నువ్వొక్కడివే ఏం చేస్తావ్‌. నీ దుకాణాన్ని మాకిచ్చేయ్‌. నీకు ఎంతో కొంత డబ్బులిస్తాం. లేదంటే ఎక్కడా నీ దుకాణం సజావుగా సాగదు’ ఇదీ కూటమి నేతల బెదిరింపులు. ఇలాంటిదే గూడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వాకాడు మండలానికి నాలుగు మద్యం దుకాణాలు కేటాయించగా.. అందులో ఒక్కరికే మూడు దుకాణాలు వచ్చాయి. 

మిగిలిన ఒక్క దుకాణం వేరొకరికి వచ్చింది. దీంతో మూడు దుకాణాలు దక్కించుకున్న కూటమి నేత మరో దుకాణం కూడా ఇచ్చేయాలని టెండరులో మద్యం దుకాణం దక్కించుకున్న వ్యక్తిపై ఒత్తిడి చేస్తున్నాడు. కాదు.. కూడదంటే నువ్వెక్కడా దుకాణం నిర్వహించలేవని, మేం చెప్పినట్టు విని దుకాణం అప్పగిస్తే నీకు అంతోవింతో ఇస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక సదరు దుకాణ దారుడు తలలు పట్టుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement