లిడ్‌క్యాప్ భూముల పరిశీలన
చంద్రగిరి(తిరుచానూరు) : రేణిగుంట రోడ్డులోని లిడ్‌క్యాప్ భూములను బుధవారం లిడ్‌క్యాప్ చైర్మన్ మాణిక్యరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మూతపడిన పరిశ్రమలను సందర్శించారు. అనంతరం లిడ్‌క్యాప్ చైర్మన్ మాట్లాడుతూ 1973 అక్టోబర్ 4 మాదిగల అభివృద్ధి కోసం లిడ్‌క్యాప్ పరిశ్రమలు ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రేణిగుంట రోడ్డులో స్థలాలను కేటాయించినట్లు వెల్లడించారు. ఇక్కడే ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఉత్పత్తి ప్రారంభించినట్లు వివరించారు. గత 10 పదేళ్లలో లిడ్‌క్యాప్‌కు సంబంధించిన భూములను నాశనం చేశారని తెలిపారు. ఆయా భూములను తిరిగి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సర్వే చేయించి కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.
4 నుంచి వస్త్రాల ఈ–వేలం
తిరుపతి(అలిపిరి): టీటీడీ పరిధిలోని ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 358 లాట్ల వస్త్రాలను నవంబరు 4 నుంచి 11వ తేదీ వరకు ఈ –వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. వివరాలకు 0877–2264429, www.tirumal a.org/ www.konugolu.ap.govt.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment