● కొనసాగుతున్న సామాజిక పెన్షన్ల తొలగింపు ● నాలుగు నెలల్లోనే 3,674 వరకు తగ్గింపు ● ప్రశ్నిస్తే.. లబ్ధిదారులు మృతిచెందారని అధికారుల బుకాయింపు ● ఇదెక్కడి ‘మంచి ప్రభుత్వం’ అంటున్న అవ్వాతాతలు | - | Sakshi
Sakshi News home page

● కొనసాగుతున్న సామాజిక పెన్షన్ల తొలగింపు ● నాలుగు నెలల్లోనే 3,674 వరకు తగ్గింపు ● ప్రశ్నిస్తే.. లబ్ధిదారులు మృతిచెందారని అధికారుల బుకాయింపు ● ఇదెక్కడి ‘మంచి ప్రభుత్వం’ అంటున్న అవ్వాతాతలు

Published Thu, Oct 31 2024 1:06 AM | Last Updated on Thu, Oct 31 2024 1:06 AM

● కొన

● కొనసాగుతున్న సామాజిక పెన్షన్ల తొలగింపు ● నాలుగు నెలల్

అధికారంలోకి వచ్చిన నాలుగు

నెలల్లోనే కూటమి ప్రభుత్వం

కుట్రలకు తెరతీసింది. గుట్టుగా అవ్వాతాతల పొట్టకొట్టేస్తోంది. ఎన్‌టీఆర్‌ సామాజిక భద్రతా పింఛన్‌లలో ప్రతి నెలా కోత

విధిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 3,674 మంది లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించేసింది. దీనిపై ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తోంది. ఆవు చేలో మేస్తే..

దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా.. అధికారులు సైతం సర్కారు పన్నాగంలో భాగస్వాములయ్యారు. పెన్షన్‌ పైనే

ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి అన్యాయం చేస్తున్నారు.

తిరుపతి అర్బన్‌ : ఎన్టీఆర్‌ సామాజిక భద్రతా పింఛన్‌ లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెల తరిగిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలలల్లోనే 3,674 పింఛన్లకు కోత పెట్టింది. ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తే వారంతా మృతి చెందారని అధికారులు సమాధానం ఇవ్వడం విడ్డూరంగా ఉంది. తొలగించిన పెన్షనన్ల పేర్లు తెలియజేయాలని కోరితే తప్పించుకోనేందుకు యత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ వద్ద జాబితా లేదని, విజయవాడలోని డీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలోనే తిరుపతి జిల్లా పింఛన్ల తగ్గింపు జాబితా ఉందని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గత చరిత్ర పునరావృతం

సార్వత్రిక ఎన్నికల సమయంలో 45 ఏళ్ల వారికి సైతం పింఛన్‌ ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే ఎత్తడం లేదు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా జూన్‌, డిసెంబర్‌లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ఏటా సుమారు 11 వేల మందికి లబ్ధి చేకూర్చేవారు. అయితే కూటమి సర్కార్‌ మాత్రం ఇప్పటి వరకు ఒక్క పింఛన్‌ను కూడా కొత్తగా మంజూరు చేయలేదు. జూన్‌లో దాదాపు 5,500 మంది పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డిసెంబర్‌లో మరో 5వేల మందికి పైగా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గత చరిత్రను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఆయన ఇదే తరహాలో పెన్షనర్లను తొలగించేవారు. ఎవరైనా లబ్ధిదారుడు మరణిస్తేనే మరొకరికి కొత్త పింఛన్‌ మంజూరు చేసేవారు. ఇప్పుడు కూడా అదే అదే పునరావృతమవుతోందని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా నిరుపేదల పొట్టగొట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి డీఆర్‌డీఏ కార్యాలయం

జిల్లా సమాచారం

ఇదేం పాలన

మృతులను మాత్రమే తొలగించాం

పింఛన్‌ లబ్ధిదారులను తొలగించలేదు. మృతి చెందిన వారిని మాత్రమే జాబితా నుంచి తీసేశాం. ఈ నాలుగు నెలల్లో 3,674 మందిని తొలగించింది వాస్తవమే. అయితే వారంతా మృతులే. వారి పేర్లు, వివరాలు మావద్ద లేదు. విజయవాడలోని డీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నాయి. కొత్త పింఛన్ల మంజూరుపై మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అవి వస్తేనే వెల్లడించగలం. అప్పటి వేచి ఉండాల్సిందే.

– శోభన్‌బాబు, పీడీ, డీఆర్‌డీఏ

కూటమి నేతలు ఇది మంచి ప్రభుత్వం అంటూ పది రోజులపాటు డబ్బా కొట్టుకుని ఇంటింటికీ వెళ్లి ఒక స్టిక్కర్‌ను అతికించి చేతులు దులుపుకున్నారు. ఎంత మేరకు ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతున్నారో ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేయాల్సి ఉంది. అయితే ఆ మాట లేదు. పాఠశాలలు ప్రారంభించి ఐదు నెలలు గడుస్తున్న తల్లికి వందనం పథకానికి దిక్కులేదు. నిరుద్యోగ భృతీ లేదు. ప్రతి నెలా మహిళలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఊసేలేదు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఎలాంటి ప్రకటన లేదు. ఇప్పటి వరకు సక్రమంగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. పైగా ఉన్న పథకాలకు సైతం తూట్టు పొడుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● కొనసాగుతున్న సామాజిక పెన్షన్ల తొలగింపు ● నాలుగు నెలల్1
1/2

● కొనసాగుతున్న సామాజిక పెన్షన్ల తొలగింపు ● నాలుగు నెలల్

● కొనసాగుతున్న సామాజిక పెన్షన్ల తొలగింపు ● నాలుగు నెలల్2
2/2

● కొనసాగుతున్న సామాజిక పెన్షన్ల తొలగింపు ● నాలుగు నెలల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement