తిరుపతి జిల్లా వివరాలు | - | Sakshi
Sakshi News home page

తిరుపతి జిల్లా వివరాలు

Published Thu, Oct 31 2024 1:06 AM | Last Updated on Thu, Oct 31 2024 1:06 AM

తిరుప

తిరుపతి జిల్లా వివరాలు

జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా ఆధార్‌ తరహాలో విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వన్‌ నేషన్‌– వన్‌ స్టూడెంట్‌ నినాదంతో విద్యార్థులకు 12 అంకెలతో కూడిన అపార్‌(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమీ అకౌంట్‌ రిజిస్ట్రీ) నంబర్‌ కేటాయించనుంది. యూడైస్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌ వేదికగా జాతీయ స్థాయిలో అపార్‌ నంబర్‌ కేటాయించి విద్యార్థికి సంబంధించిన సమస్త సమాచారం అందులో నిక్షిప్తం చేయనుంది. కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు ఈ నంబర్‌ కేటాయించనుంది. ఈ మేరకు జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతమైంది.

తిరుపతి సిటీ: కేంద్ర విద్యామంత్రిత్వశాఖ విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. జాతీయ నూతన విద్యావిధానంలో (ఎన్‌ఈపీ) భాగంగా ప్రతి విద్యార్థికీ పూర్తి సమాచారంతో అపార్‌ పేరుతో డిజిటల్‌ లాకర్‌కు అనుసంధానం చేస్తూ పర్మినెంట్‌ గర్తింపు కార్డును అందించనుంది. ఇకపై ఆపార్‌ (ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమీ అకౌంట్‌ రిజిస్ట్రీ) కీలక పాత్ర పోషించనుంది. ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా ఒక నంబర్‌ను కేటాయించి.. అందులో సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేయనుంది. యూడైస్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌ వేదికగా జాతీయ స్థాయిలో అపార్‌ నంబర్‌ను కేటాయించేందుకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. దీంతో తిరుపతి జిల్లాలోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 2,25,225 మంది విద్యార్థుల అపార్‌ ప్రక్రియ ముమ్మరంగా కొసాగుతోంది.

విద్యార్థి భవిష్యత్‌కు అపార్‌ కీలకం

విద్యార్థి ఉన్నత చదువులకు, ఉపాధి, ఉద్యోగాలలో అపార్‌ కార్డు కీలకంగా మారనుంది. పుట్టిన తేదీ నుంచి విద్యార్థి పూర్తి వివరాలు, 12 అంకెలతో కూడిన ఐడీ, క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ కార్డు రూపంలో భద్రపరుస్తారు. విద్యార్థి చదువుకు సంబంధించిన మార్కుల జాబితా, వ్యక్తిగత సమాచారం, సాధించిన విజయాలు, క్రీడలలో సాధించిన ప్రతిభ, అవార్డులు, పురస్కారాలు ఎప్పటికప్పుడు అపార్‌లో నమోదవుతాయి. సంబంధింత విద్యార్థి సమాచారం తెలుసుకోవాలంటే క్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే బయోడేటా పూర్తిగా తెలుకోవచ్చు. ఉద్యోగాల భర్తీ, ఉపకార వేతనాలు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్య ప్రవేశాల సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థీ అపార్‌ కార్డు చేసుకోవాల్సి ఉంది.

తొలి దశలో 9 నుంచి ఇంటర్‌ వరకు

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారులు తొలిదశలో 9, 10, ఇంటర్‌ విద్యార్థులకు అపార్‌ కార్డును అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. యూడైస్‌ ప్లస్‌ వెబ్‌సైట్లో విద్యార్థి పెన్‌ (పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌) నంబర్‌, వ్యాలిడిటీ ఆధార్‌ నంబర్‌ ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నూతన విధానంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రతి పాఠశాలలోనూ తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కసారి కార్డు వచ్చిందంటే మార్పులకు అవకాశం ఉండకపోవడంతో విద్యార్థుల వివరాలు అక్షరం తప్పులేకుండా నమోదు చేస్తున్నారు. మలి దశలో కేజీ టూ పీజీ విద్యార్థులకు సైతం అపార్‌ అందించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పాఠశాలలు సంఖ్య విద్యార్థుల

సంఖ్య

ప్రాథమిక 1,817 47,998

ప్రాథమికోన్నత 194 13,983

ఉన్నత 323 74,589

జూనియర్‌

కళాశాలలు 61 88,685

భవిష్యత్‌ ‘అపార్‌’ం!

వన్‌ నేషన్‌– వన్‌ స్టూడెంటే లక్ష్యం

ఎన్‌ఈపీలో భాగంగా

విద్యార్థులకు అపార్‌ కార్డు

12 అంకెలతో జాతీయ స్థాయి గుర్తింపు ఐడీ

తొలి దశలో 9 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు జారీ

త్వరలో కేజీ టూ పీజీ విద్యార్థులకు సైతం

జిల్లాలో ప్రారంభమైన ప్రక్రియ

తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

విద్యార్థుల వ్యక్తగత సమాచార గోప్యతపై అధికారులు పట్టిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అపార్‌ ఐడీ వివారలు ఆధీకృత వినియోగదారుల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేలా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 18 ఏళ్లలోపు పిల్లల అపార్‌ ఐడీ జనరేషన్‌ చేసేందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటున్నారు.

విద్యార్థులకు అపార్‌ కీలకం

మా అబ్బాయి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంటెక్‌ అడ్మిషన్‌ కోసం వెళ్లినప్పుడు ధ్రువపత్రాల విషయంలో సమస్య ఏర్పడింది. మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ కావాలంటూ ఇబ్బంది పెట్టారు. తిరిగి ఎస్వీయూకు వెళ్లి సంబంధిత సర్టిఫికెట్‌ కోసం సుమారు వారం రోజుల పాటు తిరగాల్సి పరిస్థితి ఏర్పడింది. అపార్‌ కార్డు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కావు.

–సుబ్రమణ్యం, విద్యార్థి తండ్రి, తిరుపతి

జీవిత కాల ఐడీగా అపార్‌

అపార్‌ కార్డు ప్రతి విద్యార్థికి ఇక జీవిత కాల ఐడీగా పనిచేయనుంది. ఇందుకు సంబంధించి తల్లిదండ్రుల అనుమతులు తప్పక తీసుకోవాలని హెచ్‌ఎంలకు సూచించాం. కళాశాల ప్రిన్సిపాల్స్‌ సైతం ఒక్క అక్షరం తప్పులు దొర్లకుండా విద్యార్థి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనుంది.

–శేఖర్‌, డీఈఓ, తిరుపతి జిల్లా

రిస్క్‌ తగ్గుతుంది

అపార్‌ ఎంతో ఉపయోగకరం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైతే చాలు తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల దగ్గర రోజుల తరపడి తిరుగాల్సిన పరిస్థితి. అపార్‌తో అలాంటి ఇబ్బందులకు కేంద్ర ప్రభుత్వం చెక్‌ పెట్టిడం శుభపరిణామం.

–ప్రభావతి, టీచర్‌, తిరుపతి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
తిరుపతి జిల్లా వివరాలు
1
1/4

తిరుపతి జిల్లా వివరాలు

తిరుపతి జిల్లా వివరాలు
2
2/4

తిరుపతి జిల్లా వివరాలు

తిరుపతి జిల్లా వివరాలు
3
3/4

తిరుపతి జిల్లా వివరాలు

తిరుపతి జిల్లా వివరాలు
4
4/4

తిరుపతి జిల్లా వివరాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement