1 నుంచి స్కిల్ సెన్సెస్
నవంబర్ 1వ తేదీ నుంచి స్కిల్ సెన్సెస్ చేపడు తున్నట్లు జేసీ శుభం బన్సల్ తెలిపారు. ఈ మే రకు ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు.
‘సంస్మరణ’కు
సంఘీభావం
చంద్రగిరి(తిరుచానూరు)/తిరుపతి క్రైమ్: : పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం తిరుచానూరులోని ఓ ప్రైవేట్ కన్వెవెన్షన్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సుబ్బరాయుడు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను, విశిష్ట సేవలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. తిరుపతి, చంద్రగిరి, తిరుమల, రేణిగుంట, పుత్తూరు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసులు, ప్రజలు, విద్యార్థులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి సంఘీభావం తెలపడం సంతోషంగా ఉందని చెప్పారు. సేకరించిన రక్తాన్ని తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, రుయా, స్విమ్స్, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు అందజేస్తున్నట్లు వెల్లడించారు. రక్తదానం అంటే ప్రాణదానంతో సమానమని, రోడ్డు ప్రమాదాలు, మేజర్ సర్జరీలు వంటి అత్యవసర సమయాలలో ఎంతోమందికి ఉపయోగపడుతుందని వివరించారు. తిరుపతిలో 509 మంది రక్త దాతలు, అలాగేసబ్ డివిజన్లలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలలో 156 మంది కలిసి మొత్తం 765 యూనిట్ల రక్తం దానం చేశారన్నారు. నిజ జీవితంలో పోలీసులు నిరంతరం ప్రజారక్షణకే శ్రమిస్తుంటారని, వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, నాగభూషణ రావు, శ్రీనివాస రావు సాయుధ దళం డీఎస్పీలు గిరిధర్, వెంకటనారాయణ, ప్రసాద్, శ్రీలత, చిరంజీవి పాల్గొన్నారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment