1 నుంచి స్కిల్ సెన్సెస్
తిరుపతి అర్బన్ : జిల్లాలో నవంబర్ 1వ తేదీ నుంచి స్కిల్ సెన్సెస్ చేపట్టాలని జేసీ శుభం బన్సల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సెన్సెస్ చేపట్టనున్న ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. జేసీ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని వ్యక్తుల విద్యార్హత, ఉద్యోగ వివరాలను సేకరించాలని సూచించారు. ఒక్కో సచివాలయ పరిధిలో ఒక్కో వ్యక్తి సెన్సెస్ చేపట్టాలని చెప్పారు. జిల్లాలో 175 మంది ఉద్యోగులను ఇందుకోసం నియమించినట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి వెంకటరమణ, డీపీఓ సుశీలాదేవి, పర్యవేక్షణ అధికారి శ్యామ్మోహన్, ఏపీ ఎస్ఎస్డీసీ వెంకట్రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం, గణేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment