కదంతొక్కిన విద్యార్థులు
ఫీజు రీయింబర్స్ మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
అడ్డదిడ్డం.. గందరగోళం!
తిరుపతి నగరంలో వాహనదారులు, అంగళ్ల నిర్వాహకులు, పాదచారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
గురువారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2024
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగేది. అన్నదాతలకు సకాలంలో పెట్టుబడి సాయం అందేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి ముంగిటకే ఎరువులు చేరే పరిస్థితి ఉండేది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆదర్శవంతంగా సేవలందిస్తున్న ఆర్‌బీకేలను కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తోంది. దీంతో విత్తనాలు.. ఎరువులు సక్రమంగా అందుబాటులో లేక రైతాంగం నానా అవస్థలు పడుతోంది. అధిక ధరలు వెచ్చించి ప్రైవేట్ దుకాణాలపై ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలో సేద్యం తలకు మించిన భారంగా మారుతోంది.
2022–23 రబీలో
ఎరువుల విక్రయ వివరాలు
ఎరువు (టన్నుల్లో) ఆర్‌బీకేలు సొసైటీలు
యూరియా 15,021 4,686
డీఏపీ 1,307 362
ఎంఓపీ 247 172
కాంప్లెక్స్ 523 201
ఎస్‌ఎస్‌పీ 11 35
మొత్తం 17,109 5,456
2023–24 రబీలో..
ఎరువు (టన్నుల్లో) ఆర్‌బీకేలు సొసైటీలు
యూరియా 22,929 3,553
డీఏపీ 1,538 145
ఎంఓపీ 128 125
కాంప్లెక్స్ 1,607 94
ఎస్‌ఎస్‌పీ 05 20
మొత్తం 26,207 3937
2024– 25 ప్రస్తుత రబీలో..
ఎరువు (టన్నుల్లో) ఆర్‌బీకేలు సొసైటీలు
యూరియా 4,445 2,202
డీఏపీ 254 284
ఎంఓపీ 108 105
కాంప్లెక్స్ 136 405
ఎస్‌ఎస్‌పీ 04 18
మొత్తం 4,947 3,014
తిరుపతి అర్బన్ : రబీ సీజన్ అక్టోబర్ 1వ తేదీన మొదలై..మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా రైతులు ఒక్క వరి పంటనే సుమారు లక్ష ఎకరాలకు పైగా సాగుచేయనున్నారు. ఇతర పంటలు మరో లక్ష ఎకరాలు చేపట్టనున్నారు. మొత్తంగా రబీ సీజన్‌లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లోని పంటలకు ఎరువుల అవసరముంది. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులు సైతం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్‌బీకేల్లో అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సింగిల్ విండో కార్యాలయాల్లో సైతం ఎరువులు అంతంత మాత్రమే ఉంటున్నాయని వాపోతున్నారు. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద మాత్రం పుష్కలం ఎరువులున్నాయని వెల్లడిస్తున్నారు. దీంతో చేసేది లేక అధిక ధరలు చెల్లించి ప్రైవేటు దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నామని వివరిస్తున్నారు. ఆర్‌బీకేలు, సొసైటీల్లో ఎరువు బస్తా ధర రూ.270 ఉంటే, ప్రైవేట షాపుల్లో రూ.310కి విక్రయిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు బస్తాపై ఆర్‌బీకేకి, ప్రైవేటు దుకాణాలకు రూ.30 నుంచి రూ.40 తేడా ఉందని వెల్లడిస్తున్నారు. ఆర్‌బీకేలు గ్రామంలోనే ఉంటాయి కాబట్టి రవాణా చార్జీలు ఉండవని, ప్రైవేట్ షాపుల్లో అయితే అదనంగా రవాణా చార్జీల మోత తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ఖాళీగా ఆర్‌బీకేలు, సొసైటీలు
ఎరువుల కోసం అన్నదాతల తిప్పలు
కళకళలాడుతున్న ప్రైవేట్ షాపులు
అధిక ధరలతో రైతుల ఇక్కట్లు
అదనపు భారంగా రవాణా చార్జీలు
రూ.57లక్షల బకాయి
ఏపీ మార్కెఫెడ్ జిల్లా కార్యాలయం నుంచి సాధారణంగా ఆర్‌బీకే, సొసైటీలకు ఎరువులు సరఫరా చేస్తారు. ఎంత మేర కావాల్సి ఉంటుందో ఇండెంట్ పెట్టుకుంటే 48 గంటల్లోనే అందజేస్తారు. వారంలోపు ఎరువులు విక్రయించి నగదును మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్‌బీకేల నుంచి రూ.17లక్షలు, సొసైటీల నుంచి రూ.40లక్షలు మార్కెఫెడ్‌కు బకాయిలు ఉన్నాయి. ఎరువుల విక్రయం తర్వాత సకాలంలో సొమ్మును చెల్లించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు అలసత్వం వహించారు. దీంతో మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు సరఫరా ఆగిపోయింది. ఈ క్రమంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఆర్థిక భారం మోయలేక నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఇందులో మరో వాదన గట్టిగా వినిపిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్‌బీకేలను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చూపుతోందని పలువురు రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రైవేటు వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే ఆర్‌బీకేలు, సొసైటీల్లో ఎరువుల కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేలు, సొసైటీల్లో పుష్కలంగా ఎరువులు ఉండేవని గుర్తుచేస్తున్నారు. తక్కువ ధరకే సకాలంలో ఎరువులు అందేవని వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment