● జ్ఞాన భూమి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు
తిరుపతి అర్బన్ : డీఎస్సీ అభ్యర్థులను ఉచిత శిక్షణ అంటూ కూటమి సర్కార్ మూడు నెలలుగా ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో బీసీ విద్యార్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ అంటూ దరఖాస్తులు స్వీకరించారు. సెప్టెంబర్‌లో ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అక్టోబర్‌లో ఎస్సీ అభ్యర్థుల ద్వారా దరఖాస్తులు చేయించుకున్నారు. అయితే బీసీ విద్యార్థులకు సంబందించి 300 దరఖాస్తులు రాగా మెరిట్ ప్రకారం అంటూ 200 మందిని మాత్రమే ఎంపిక చేశారు. అదే క్రమంలో ఎస్సీ, ఎస్టీకి చెందిన దరఖాస్తులు 539 వచ్చాయని అందులో 150 మందిని మాత్రమే ఎంపిక చేస్తున్నామని వెల్లడిస్తున్నారు. అందుకే ఈ నెల 10వ తేదిన ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వివరిస్తున్నారు. డీఎస్సీకి చెందిన సిలబస్ పైనే 539 మందికి తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల, పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలలో ఎంట్రన్స్ పరీక్ష చేపట్టనున్నారు. ఆ మేరకు హాల్ టికెట్లు జ్ఞాన భూమి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఫలితాల ఆధారంగా 150 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలియజేస్తున్నారు.
పటిష్ట ఏర్పాట్లు
పరీక్షకు సంబందించి పటిష్టమైన ఏర్పాటు చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. పరీక్షకు 30 నిమిషాలు ముందే రావాలని, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆమేరకు పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికార అధికారి చెన్నయ్య, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణను ఆదేశించారు. ఈ మేరకు 7013008498 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment