పదవి రాకముందే పెత్తనం
– చెంగాళమ్మ ఆలయంలో టీడీపీ నేత హల్‌చల్
సాక్షి టాస్క్‌పోర్స్: ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని కూటమి ప్రభుత్వమే చెబుతోంది. సనాతన ధర్మం కాపాడాలని స్పష్టం చేస్తోంది. అయితే తూతూమంత్రంగానే నిబంధనలు అమలు చేస్తోంది. సూళ్లూ రు పేటకు చెందిన ఓ టీడీపీ సీనియర్ నేత వ్యవహారమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. స్థానిక చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ పదవి తనకే వస్తుందని ఆయన ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆలయంలోని ప్రతి విషయంలో జోక్యం చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. పూజలు, ప్రసాదాల పంపిణీ, హుండీ లెక్కింపు ఏదైనా తాను వచ్చిన తర్వాతే చేపట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయినా పదవి రాకుండానే మితిమీరిన జోక్యం తగదని తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment