నేడు సీడాప్ జాబ్ కనెక్ట్
తిరుపతి అర్బన్: తిరుపతిలోని టీటీడీసీ ప్రాంగణంలో మంగళవారం సీడాప్ జాబ్ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు సోమవారం తెలియజేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సీడాప్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు హజరుకావాలని చెప్పా రు. ప్యూషన్ ఫైనాన్స్ లిమిటెడ్ సహకారంలో రిలే షన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతీ యువకులు 19–35 ఏళ్ల వయసు వారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉండాలని తెలిపారు. ద్విచక్ర వాహనంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌తోపాటు మరిన్ని వివరాల కోసం 97013 87293, 63022 80583ను సంప్రదించాలని సూచించారు.
మద్యం అక్రమ విక్రయాలపై ఎకై ్సజ్ దాడులు
తిరుపతి రూరల్: మద్యం అక్రమ విక్రయాలపై తిరుపతి రూరల్ ఎౖక్సైజ్ సర్కిల్ పోలీసులు దాడులు చేశారు. సోమవారం రేణిగుంట మండలం గాజులమండ్యంలో తనిఖీలు చేశారు. సుమతి అనే మహిళ వద్ద 10 మద్యం బాటిళ్లను గుర్తించి, విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఆమెను అరెస్ట్ చేసి మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు తిరుపతి రూరల్ ఎకై ్సజ్ సర్కిల్ సీఐ నరసానాయుడు తెలిపారు. ఎస్‌ఐలు అంజలిప్రసన్న, కవీశ్వరనాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment