గ్రీవెన్స్‌కు కనీస వసతులు
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులకు ఉందని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి 1.30 గంటల వరకు గ్రీవెన్స్ చేపట్టారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో గ్రీవెన్స్‌కు కనీస వసతులు ఎక్కడ అంటూ.. ప్రచురితమైన వార్తపై ఆయన స్పందించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు కనీసం కుర్చీలు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది ఎంటి అంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. తాగునీటి వసతులు కల్పించాలని ఆదేశించారు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహిరించాలని, వారి సమస్యలను నిశితంగా తెలుసుకుని పరిష్కరించాలని చెప్పారు. ఇదిలావుండగా సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 168 అర్జీలు అందగా.. అందులో 109 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయని వెల్లడించారు. గడువులోపు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
మృత్యుంజయుడికి విశేష పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన చేపట్టారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ, పసుపు, కుంకుమ, విభూది వంటి వాటితో అభిషేకాలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment