బీమాకు నామం!
ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం పంగనామాలు పెట్టింది. ఇకపై బీమా మొత్తం రైతులే చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
అనంత సాగరంలో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించాలని సంకల్పించింది. అపురూప జలచరాలు.. ఖనిజ సంపదను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. ప్రకృతి విపత్తులను ముందుగా పసిగట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీని ప్రారంభించింది. ప్రతిష్టాత్మక సెంటర్‌ను వాకాడు మండలం తూపిలిపాళెంలో ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.500 కోట్లు వెచ్చించింది. అధునాతన పరికరాల సాయంతో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించే ఈ కేంద్రం ఎలా పనిచేస్తుందో వివరించే విశేషాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
● తూపిలిపాళెంలో ఓషన్ టెక్నాలజీ కేంద్రం ● జలరాశులు, ఖనిజ సంపదలపై నిత్య పరిశోధనలు ● విపత్తులను ముందుగా పసిగట్టేందుకు శ్రీకారం ● మైరెన్ కోర్సులు చదివిన యువతకు ఉద్యోగావకాశాలు
మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2024
బ్యాలస్ట్ వాటర్ ట్రీట్‌మెంటు టెస్టు ఫెసిలిటీ పరీక్షా పరికరాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
ఎన్‌ఐఓటీ అంటే ..
కేంద్ర ఎర్త్, సైన్స్‌శాఖ 1993లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ కేంద్రాన్ని చైన్నెలో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి గవర్నింగ్ కౌన్సిల్‌తోపాటు ఎందరో శాస్త్రవేత్తలను నియమించి సముద్రంలో పరిశోధనలు సాగిస్తున్నారు. సముద్రంలోని జలచర రాశులతోపాటు ఖనిజ సంపదను గుర్తించి వెలికి తీసేలా ఈ కేంద్రం పనిచేస్తుంది. గతంలో వివిధ సర్వేలు నిర్వహించగా వాకాడు మండలం, తూపిలిపాళెం సమీపంలోని పామంజి తీర ప్రాంతం ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్(ఈఈజెడ్)గా గుర్తించారు. అందుకే ఇక్కడ ఎన్‌ఐఓటీ కేంద్రం ఏర్పాటు చేశారు. దీని ద్వారా సముద్రంలోని లివింగ్ నాన్ లివింగ్ రిసోర్స్ (జలచర, ఖనిజ వనరులు)గుర్తించేలా పరిశోధనలు చేపడుతున్నారు.
వాకాడు: అనుకోకుండా 2004 డిసెంబర్ 26న ముంచుకు వచ్చిన సునామీ కారణంగా ఊహకు అందనంత ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇది దృష్టిలో ఉంచుకునే భారత పరిశోధకులు ఇలాంటి విపత్తులు భవిష్యత్‌లో తలెత్తకుండా ముందుగానే పసిగట్టేందుకు ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే తొలుత చైన్నెలో ఎన్‌ఐఓటీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని పరిశోధనలు ప్రారంభించారు. వీటికి మరింత టెక్నాలజీని జోడించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తూపిలిపాళెం వద్ద భారీ ఎన్‌ఐఓటీ కేంద్రానికి రూ.500 కోట్లతో 2015 మే 25వ తేదీన శ్రీకారం చుట్టింది. ఇది ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ క్రమంలోనే వారం రోజుల కిందట ఈ ప్రతిష్టాత్మక సెంటర్‌ను ప్రారంభించారు. కేంద్ర ఎర్త్, సైన్స్ పర్యవేక్షణలో ఈ సెంటర్ నడుస్తుంది. సునామీ, ఇతర వాతావరణ విషయాలను ముందుగానే పసిగట్టేందుకు దోహదపడుతుంది. మైరెన్ కోర్సులు చదివిన నిరుద్యోగ యువతకు ఈ కేంద్రంలో ఉపాధి కల్పనకు అవకాశముంటుంది.
వాటర్ ట్రీట్‌మెంట్ టెస్టు ఫెసిలిటీ
పరీక్ష కేంద్రం
బ్యాలస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ టెస్టు ఫెసిలిటీ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు పనులు ఇంకా సాగుతున్నాయి. ఇది సముద్రం, నదీ ముఖద్వారాల మధ్య ఏర్పాటు చేయనున్నారు. దీనిని భారతదేశంలోనే తూర్పు తీరంలో వ్యూహాత్మక ఉష్ణ మండల ప్రాంతమైన తూపిలిపాళెం పామంజి తీరంలో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా బంగాళాఖాతం నుంచి 35 పీపీటీ సముద్రపు ఉప్పు నీటిని, స్వర్ణముఖి నది ముఖద్వారం నుంచి 15 పీపీటీ నీటిని అలాగే బకింగ్ హామ్ కెనాల్ నుంచి 2 పీపీటీ నీటిని తీసుకుని రెండు పరిణామాల సమూహంలోని 5 రకాల జీవులను ఏక కాలంలో పెంచడానికి అత్యాధునిక సర్రోగేట్ పరీక్ష కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ఇన్‌లెట్, ఆవుట్‌లెట్ వాటర్‌ను పిజికో కెమికల్, బయోలాజికల్ పరిమితులను విశ్లేషించడానికి ఎన్‌ఐఓటీ చైన్నె వారు కోట మండలం, చిట్టేడులో ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీని సైతం ఏర్పాటు చేశారు.
– 8లో
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment