సమాన అవకాశాలతోనే మహిళా సాధికారత
రేణిగుంట(ఏర్పేడు): సమాన అవకాశాలతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్‌పర్సన్ విజయభారతి సాయని అభిప్రాయపడ్డారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో సోమవారం శ్రీమహిళల హక్కులు– ఆహార భద్రతశ్రీ అంశంపై ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె జాతీయ మానవ హక్కుల కమిషన్ డీజీ అజయ్ భట్నాగర్‌తో కలసి పాల్గొని ప్రసంగించారు. ఐఐటీలో నీతి భోద్ క్లబ్, నేషనల్ సర్వీస్ స్కీమ్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఐఐటీ డైరెక్టర్ మానవ హక్కులు, మహిళల సంక్షేమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్‌పర్సన్ మాట్లాడుతూ మహిళల శ్రేయస్సు, సాధికారతకు ప్రాథమికమైన వనరులకు సమాన ప్రాప్తిని కలిగి ఉండేలా సమిష్టి కృషి అవసరమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అజయ్ భట్నాగర్ మాట్లాడుతూ మహిళల భద్రతలోని వివిధ కోణాలను, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ల నుంచి సామాజిక వైఖరులను వివరించారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్లు, నీతిభోద్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment