అన్నదాతా దుఃఖీభవ
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడి సాయం ఊసెత్తకపోవడంతో రైతులు సాగు ఖర్చులకు అప్పులబాట పట్టాల్సి వస్తోంది. ఇటువంటి పరిసితుల్లో రైతులపైనే బీమా భారాన్ని మోపడం బాధాకరం. –గంగయ్య, రైతు
భారంగా పెట్టుబడులు
పెట్టుబడుల భారం రైతులను కుదేలు చేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే రానురానూ పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. పంట చేతికి వచ్చే దాకా ఖర్చు పెట్టాల్సి రావడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక మొత్తానికి వడ్డీలు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం రైతుకు అండగా ఉండాలి.
– వెంకటరత్నం, రైతు
గత ప్రభుత్వంలో రైతు సుభిక్షం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు చేదోడు వాదోడుగా ఉండేది. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా పథకం, రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ అవనరాలు తీర్చడం వంటి పనులు చేసింది. రైతులకు అత్యంత ప్రయోజకరంగా ఉచిత పంటల బీమా ఉండేది. అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. – ఆర్.శేఖర్, రైతు
Comments
Please login to add a commentAdd a comment