ఘనంగా జోనల్ క్రీడలు ప్రారంభం
కోట: బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల జోనల్ క్రీడాపోటీలు కోటలో ఘనంగా ప్రారంభమయ్యా యి. ఎస్సీ గురుకులాల సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ బుధవారం క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించి, గౌరవ వందనం స్వీకరించారు. 75 అడుగుల పొడవు ఉన్న జాతీయజెండాతో విద్యార్థులు ర్యాలీ చేశారు. 17 పాఠశాలలు, కళాశాలల నుంచి 650 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. డీసీఓలు జయలక్ష్మి, జయశ్రీ,కోట ఎంపీపీ అంజమ్మ, జెడ్పీటీసీ కోటయ్య పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
● పాఠశాల విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో నరేంద్ర (కురిచేడు, ప్రకాశంజిల్లా) ప్రఽథమస్థానం, నితీష్ సంజయ్(చిల్లకూరు) ద్వితీయస్థానం, తిరుపతయ్య(నాయుడుపేట) తృతీయస్థానం సాధించారు.
● 800 మీటర్ల రన్నింగ్ రేస్‌లో సాయినికేతన్(కోట) ప్రథమ, కోటేశ్వరయ్య(చిల్లకూరు) ద్వితీ య, నవీన్‌కుమార్(కోట) తృతీయస్థానం ద క్కించుకున్నారు.
● 1500 మీటర్ల రన్నింగ్‌లో నవీన్‌కుమార్(కోట)ప్రథ మ, సాయినికేతన్(కోట) ద్వితీయ, కోటేశ్వరయ్య(చిల్లకూరు) తృతీయస్థానం కై వసం చేసుకున్నారు.
● షాట్‌పుట్‌లో నితీష్‌సంజయ్(చిల్లకూరు) ప్రథ మ, దిలీప్(వాకాడు)ద్వితీయ, ఫణీంధ్ర(సత్తెనపల్లి) తృతీయస్థానాల్లో నిలిచారు.
కళాశాల విభాగం..
● 100 మీటర్ల రన్నింగ్ రేస్‌లో సుబ్రమణ్యం(వాకాడు) ప్రథమ స్థానం, సతీష్(నాయుడుపేట) ద్వితీయ స్థానం, హేమంత్‌కుమార్(వాకాడు) తృతీయస్థానం సాధించారు.
● 800మీటర్లు.. శివయ్య(కోట) ప్రథమ, ధనుష్ (వాకాడు) ద్వితీయ, రాహుల్(చిల్లకూరు) తృతీయస్థానం దక్కించుకున్నారు.
● 1500 మీటర్లు.. శివయ్య(కోట) ప్రథమ, రాహుల్(చిల్లకూరు)ద్వితీయ,సాగర్(అచ్చంపేట)తృతీయస్థానం కై వసం చేసుకున్నారు.
● షాట్‌పుట్‌లో యశ్వంత్(చిల్లకూరు) ప్రధమ, చైతన్య(వెలుగొండ)ద్వితీయ, మదన్‌మోహన్(కారంపూడి) తృతీయస్థానం చేజిక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment