ఇల్లెప్పుడు పూర్తవుతుందో..? | - | Sakshi
Sakshi News home page

ఇల్లెప్పుడు పూర్తవుతుందో..?

Published Thu, Nov 21 2024 1:18 AM | Last Updated on Thu, Nov 21 2024 1:18 AM

ఇల్లె

ఇల్లెప్పుడు పూర్తవుతుందో..?

ఇసుక కొరతతో

ఇళ్ల నిర్మాణంలో జాప్యం..

గృహనిర్మాణశాఖా మంత్రి కొలుసు పార్థసారథి నవంబర్‌ 9వ తేదీన స్వయంగా అన్నమాట ఇది. ఇ టీవల కలెక్టరేట్‌ కార్యాలయంలో మీడియా సమా వేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరతతోనే ఇంటి నిర్మాణా లు జాప్యం చోటుచేసుకుందని వెల్లడించారు. జిల్లా లో వారం రోజుల్లో ఇసుక సమస్య లేకుండా చేస్తా మని జిల్లాధికారులు మాట ఇచ్చారని చెప్పారు. అయినా ఇంకా ఇసుక కొరత కొనసాగుతోంది.

గతం కంటే గొప్పగా చేస్తామన్నారు.. పథకం పేరు మార్చారు.. ఇళ్లు మంజూరు చేశారు.. ఇసుక ఉచితం అన్నారు.. అయినా ఇవ్వలేకపో యారు.. తిరివి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. నేటికీ వారికి సైఖతం కొరత తీర్చలేకపోయారు. ఫలితంగా పక్కా ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు.. ఫలితంగా ఇల్లెప్పుడు పూర్తవుతుందోనని పేదలు నిరీక్షిస్తున్నారు. ఇదీ జిల్లాలో ఇసుక, ఇళ్ల నిర్మాణ దుస్థితి.

తిరుపతి అర్బన్‌:ఇసుక కొరతతో ఎన్టీఆర్‌ పక్కా గృహా ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఫలితంగా పేదల సొంతింటి కల స్వప్నంగానే మారుతోంది. ఇసుక ఉచితం అంటూ జూలై 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ నీరుగారిపోయింది. ప్రారంభం నుంచి ఇసుక కొరత తప్పలేదు. ఉచితం కోసం జిల్లాలో నాలు గు ఇసుక పాయింట్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న ఇసుకను కూటమి నేతలు కొల్లగొట్టి, ఆ ఇసుక పా యింట్లు మాసివేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం ఆగింది.

ఉచితం కాదు..ధర దడే

కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం రాత్రి ఇసుక యార్డ్‌లను నిర్వహించడానికి కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, జేసీ శుభం బన్సల్‌ నేతృత్వంలో టెండర్లు ఖరారు చేశారు. జిల్లాలో మూడు ఇసుక యార్డ్‌లను నిర్వహణకు ముగ్గురు వ్యాపారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. మరో ఐదు రోజుల లోపు వీరు ఇసుకను తమకు కేటాయించిన యార్డ్‌ల్లో అందుబాటుల్లో ఉంచాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆ దేశించారు. ఇవన్నీ తిరుపతితోపాటు సమీప ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మిగిలిన దూర ప్రాంతాలకు చెందిన వారు తిరుపతికి రావడానికి రవాణా చార్జీల మోత తప్పేలా లేదు. ముందే టన్ను ధర రూ.640 నుంచి రూ.675కు రవాణా చార్జీలతో కలుపుకుంటే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

● తిరుపతి కాటన్‌ మిల్‌ వద్ద ఇసుక యార్డ్‌ను నిర్వహించడానికి శ్రీనివాసులురెడ్డికి అవకాశం ల భించింది. అన్నమయ్య జిల్లా నుంచి తెచ్చుకుని ట న్ను ఇసుక రూ. 640కు విక్రయించాలి.

● తిరుపతి రూరల్‌ అవిలాల వద్ద ఇసుక యా ర్డ్‌ పి.శైలజకి దక్కింది. ఆమె అన్నమయ్య జిల్లా నుంచి తెచ్చి అవిలాల వద్ద టన్ను రూ.640కు విక్రయించాలి.

● రేణిగుంట మండలం గాజులమండ్యం వద్ద కే. శ్రీనివాసులుకు ఇసుక యార్డ్‌ దక్కింది. అన్నమయ్య జిల్లా నుంచి ఇసుకను తెచ్చుకుని టన్ను రూ. 675కు విక్రయించాల్సి ఉంటుంది.

పేదల ఆవేదన పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇసుక గండం ముందుకు సాగని గృహ నిర్మాణాలు నత్తనడకన ఎన్టీఆర్‌ గృహాలు

కూటమి సర్కార్‌లో...

గత జూన్‌లో రాష్ట్రంలో కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. జగనన్న అందరికీ ఇళ్ల పథకాన్ని ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకంగా పేరు మార్పు చేసింది. ఆ తర్వాత ఇసుక కొరత ఏర్పడింది. పచ్చనేతలు ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం సాగించడంతో సామాన్యులకు ఇసుక భారంగా మారింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. అధికారంలోకి వచ్చిన రెండు నెలలపాటు ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్ట్‌ బాధ్యతలు తమకు అప్పగించాలంటూ టీడీపీ కూటమి నేతలు రచ్చరచ్చ చేశారు. దీంతో అప్పటి కాంట్రాక్టర్లు తమకు ఇవ్వాల్సిన బిల్లులు చెల్లిస్తే తాము తప్పుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ల సమస్యలకు పరిష్కారం చూపించారు. ఆ తర్వాత ఇసుక సమస్యతో ఇళ్ల నిర్మాణాలు తూతూమంత్రంగా సాగుతున్నా యి. జూన్‌ నుంచి నవంబర్‌ 20వ తేదీ వరకు చూస్తే కేవలం 1,149 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. అందుకు రూ.6.35 కోట్ల నిధులు మంజూరు చేశారు.

వైఎస్సార్‌సీపీ సర్కార్‌లో...

గత సర్కార్‌లో జిల్లా వ్యాప్తంగా 575 జగనన్న లే అవుట్లలో అందరికీ ఇళ్లు పథకంలో 77,756 ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు మంజూరు చేశారు.2022 మే నుంచి 2024 మే వరకు( రెండేళ్ల వ్యవధిలో) నెలకు వెయ్యి వంతున 24,618 ఇళ్లు పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించారు. అందుకు రూ.792.52 కోట్లు బిల్లులు ఈ ఏడాది మే 31 నాటికి విడుదల చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. అంతేకాకుండా జగనన్న లేఅవుట్లలో విద్యుత్‌, రోడ్లు, తాగునీరు తదితర వసతులు కల్పించారు. 2025 మార్చి 31వ తేదీ నాటికి వందశాతం ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 774 పంచాయతీలతోపాటు 575 జగనన్న లేఅవుట్లు పూర్తి అయితే అదనంగా మరో 575 పంచాయతీలు ఏర్పడతాయని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో ఇంతలోనే ప్రభుత్వం మారింది. దీంతో ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.

ఇసుక కొరత ఉంది

ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత ఉంది. దాంతోనే ఇంటి నిర్మాణాల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. జిల్లాలో 77,765 ఇళ్ల్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు మొత్తంగా 25,765 ఇళ్లు పూర్తి చేశాం. 2,463 ఇళ్లు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. త్వరలో వాటి ని ర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపడుతాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో సాగుతున్నాయి. ఈ జూన్‌ నుంచి నవంబర్‌ 20వ తేదీ వరకు 1,148 ఇళ్లు పూర్తి చేశాం. రూ.6.35 కోట్లు నిధులు విడుదల చేశాం. గతంలో 24,618 ఇళ్లు పూర్తి చేశారు. మిగిలిన అన్ని ఇళ్లు పూర్తి చేయడానికి చర్యలు చేపడుతాం. – శ్రీనివాసులు,

గృహనిర్మాణశాఖ, పీడీ, తిరుపతి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
ఇల్లెప్పుడు పూర్తవుతుందో..?1
1/2

ఇల్లెప్పుడు పూర్తవుతుందో..?

ఇల్లెప్పుడు పూర్తవుతుందో..?2
2/2

ఇల్లెప్పుడు పూర్తవుతుందో..?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement