కారిడార్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి అర్బన్: వైజాగ్–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్‌తోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా వివిధ పారిశ్రామిక వాడల్లో నీటి సరఫరా పైపులైన్ల పనులు వేగవంతం చేయాలని, ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ చంద్రశేఖర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
శెట్టిపల్లె భూ సమస్యలకు పరిష్కారం చూపండి
దీర్ఘకాలంగా కొనసాగుతున్న శెట్టిపల్లె భూ సమస్యలకు త్వరిగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన జేసీ శుభం బన్సల్‌తో కలసి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి చేయడానికి తీసుకోవాల్సిన అంశాలను గుర్తించాలన్నారు. ఎంత దరఖాస్తుదారులు ఉన్నారు? వారు కొనుగోలు చేసిన లేఔట్ల మ్యాప్‌ను సిద్ధం చేసి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, జిల్లా సర్వే అధికారి అరుణ్ కుమార్, అర్బన్ తహసీల్దార్ కేవీ భాగ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment