వైద్యకళాశాలకు సుజుకీ ఎకోవ్యాన్ విరాళం
తిరుపతి తుడా: క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం ఎస్వీ వైద్య కళాశాలకు రు యా విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ టి.భారతి రూ.7 లక్షల విలువగల మారుతీ సు జుకీ ఎకో వ్యాన్‌ను విరాళంగా అందజేశారు. తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథిరెడ్డి బుధవారం నూతన వాహనాన్ని వైద్య కళాశాల ఆవరణలో ప్రారంభించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి చంద్రశేఖరన్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ డీఎస్‌ఎన్ మూర్తి, డాక్టర్ ఎస్ సునీత, డాక్టర్ కిరీటి, డాక్టర్ కె సునీత, డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
రాపూరు: మండలంలోని రాపూరు, సిద్ధవరం, జోరేపల్లి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్న చెంచయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయానికి బుధవారం ఉత్తర్వులు వచ్చాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సిద్ధవరం పంచాయితీ కోటురుపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళ నాగలక్ష్మి తన తండ్రి శంకరయ్య మరణ ధ్రువీకరణపత్రం కోసం పలుమార్లు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా సర్టిఫికెట్ జారీ చేయలేదు. పైగా చెంచయ్య ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడంతోపాటు వీడియో కాల్ చేయాలని, గూడూరుకు రావాలని వేధిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె ఈ నెల 4వ తేదీన జరిగిన గ్రీవేన్స్‌లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ సంఘటనపై విచారణ జరిపి, నివేదిక అందించాలని ఆదేశించారు. అధికారులు బాధితురాలిని విచారించి నివేదిక అందించారు. పంచాయతీ కార్యదర్శి తప్పు చేశారని నిర్ధారణ కావడంతో చెంచయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీఓ భవాని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో ఒక కంపార్ట్‌మెంట్ నిండింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 62,248 మంది స్వామివారిని దర్శించుకోగా 18,552 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.71 కోట్లు సమర్పించారు. టైంస్లా ట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే, ద ర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో, ప్ర త్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయాని కి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కే టాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను అనుమతించబోరని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment