తప్పుడు కేసులు ఉపేక్షించం
వెంకటగిరి(సైదాపురం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే ఉపేక్షించేది లేదని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త పేచీరాజ్ అరెస్ట్‌ను నిరసిస్తూ వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త పేచీరాజ్‌ను ఎటువంటి సమాచారం లేకుండా తెల్లవారు జామున పోలీసులు అరెస్టుచేసినట్టు తెలిపారు. తప్పుచేసే ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టబోయేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ సేతరాసిబాలయ్య, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, పోలేరమ్మతల్లి దేవస్థానం మాజీ చైర్మన్ పులి ప్రసాద్‌రెడ్డి, కౌన్సిలర్లు వహిద, కందాటి కళ్యాణి, నాయకులు చింతల శ్రీనివాసులరెడ్డి, యస్దానిబాషా, రాజారెడ్డి, సతీష్ ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతపై అక్రమ కేసు
సాక్షి టాస్క్‌ఫోర్స్. వెంకటగిరి పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు తంగా పేచీరాజ్‌పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ఆయన చురుగ్గా వ్యవహరించారు. దీంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా శనివారం తెల్లవారు జామున పేచీరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంపై పలు నాటకీయ పరిణాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను గంజాయి, దొంగతనాల కేసులో 5వ నిందితుడిగా చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment