జనవరి 5న స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు
తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. గత టీటీడీ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. 2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవచ్చని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
త్యాగానికి ప్రతీక క్రిస్మస్
తిరుపతి అర్బన్: ప్రేమ, కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్ అని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కొనియాడారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ పిల్లలతోపాటు కేక్‌కట్ చేశారు. వారి ఆటపాటలను ప్రోత్సహించారు. డీఆర్వో నరసింహులతోపాటు పలువురు చర్చి పాస్టర్లు, క్రైస్తవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తాను మిషనరీ స్కూల్‌లో చదువుకున్నాని చెప్పారు. దేవదూత అయిన జీసస్ క్రిస్తు చూపించిన మార్గాన్ని, త్యాగాన్ని వివరించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ కార్పొరేషన్ అధికారి హరినాఽథ్‌రెడ్డి, క్రిస్టియన్లు సాల్మన్‌రాజు, డేనియల్ బాబు, జాన్సన్, అరిల్ అరసు, శరత్‌బాబు, వేదనాయడు, జయపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment