కొత్తకార్డులకు మోక్షమెప్పుడో ?
కూటమి సర్కారులో కొత్త రేషన్‌కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. డిసెంబర్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ చివరి వారంలో అధికారులు వెల్లడించారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్‌లో వీలు లేకపోవడంతో వచ్చే జనవరి నుంచి అందుబాటులో ఉండొచ్చని చెబుతున్నారు. ఈఆర్నెళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదు. ఇప్పటికే 25 వేల మంది కొత్త కార్డుల కోసం నిరీక్షణ చేస్తున్నారు. మరో 30 వేల మంది కొత్త రేషన్‌కార్డుల్లో చేర్పులు, మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరో 6 వేల మంది రేషన్‌కార్డులను పోగొట్టుకున్నారు. సచివాలయానికి వెళ్తే ‘ప్రభుత్వం మారింది.. కొత్త డిజైన్‌తో కొత్త సంవత్సరంలో కార్డులు వస్తాయి.. అప్పటి వరకు వేచి ఉండండి’ అని ప్రజలకు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment