ఒక్కసారే బయోమెట్రిక్
రేషన్ దుకాణాల్లో సరుకులు ఇవ్వడానికి డీలర్ ప్రతి నెలా కార్డుదారుల నుంచి ఈపోస్ మిషన్‌లో బయోమెట్రిక్ తీసుకుంటారు. అయితే కార్డుదారులకు బియ్యం ఒకటే ఇస్తున్నప్పటికీ చక్కెర, కందిపప్పు, ఇతర సరుకులు ఇచ్చామని డీలర్లు బయోమెట్రిక్ ఒకేసారి నమోదు చేసుకుంటున్నారు. దీంతో ఆయా డీలర్లు ఎవరెవరికి ఏయే సరుకులు ఇచ్చారో అనే లెక్కను సివిల్ సప్లయ్ అధికారులు తేల్చలేకపోతున్నారు. ఇదే అదునుగా కొందరు డీలర్లు కందిపప్పును అధిక రేట్లకు మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యానికి డీడీ కట్టాల్సిన పనిలేదు. కందిపప్పు, చక్కెర, ఇతర వస్తువులకు మాత్రమే ముందుగా బ్యాంక్‌లో డీడీ కట్టి సివిల్ సప్లయ్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు డీలర్లు డీడీల జోలికి వెళ్ల డం లేదనే చర్చ సాగుతోంది. కొందరు కార్డు దారులడిగినా ఫలితం లేకుండా పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment