ఎంబీయూలో సంక్రాంతి సంబరాలు
చంద్రగిరి : మోహన్‌బాబు యూనివర్సిటీలో బుధవారం ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం, వంటలు, కోలాటాలు, కర్రసాము, గొబ్బెమ్మ పాటలు, టగ్ ఆఫ్ వార్, బిళ్లంగోడు, కబడ్డీ, ఖోఖో వంటి గ్రామీణ క్రీడలతో సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంబీయూ చాన్సలర్ మంచు మోహన్‌బాబు హాజరయ్యారు. అధ్యాపకులు, విద్యార్థులతో కలసి కోలాటాలు ఆడుతూ, ఉట్టి తాడు లాగుతూ ఉల్లాసంగా గడిపారు. మోహన్‌బాబు మాట్లాడుతూ తెలుగు జాతికి వెలుగులు తీసుకువచ్చే సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ధనుర్మాసంలో పెద్దలను స్మరించుకుంటూ వారికి నూతన వస్త్రాలు పెట్టి దైవంలా కొలుచుకోవడం మన సంప్రదాయమన్నారు. అచ్చ తెలుగు పండుగను విద్యార్థులతో కలసి జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్త కన్నప్ప సినిమా విశేషాలనుమీడియాతో పంచుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను న్యూజిలాండ్‌లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. బడ్జెట్ ఎక్కువైనా రాజీ పడకుండా నిర్మిస్తున్నట్లు వివరించారు. గతంలో శ్రీకాళహస్తీశ్వరునిపై వచ్చిన మూడు సినిమాలు అద్భుత విజయం సాధించాయని, అదే తరహాలో భక్తకన్నప్ప కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు యూనిట్ శ్రమిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment