![ప్రకృ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/0000630178-000001-selfads_mr-1738872944-0.jpg.webp?itok=q2QVDEwa)
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
రేణిగుంట: రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంభించేలా ప్రోత్సహించాలని గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ అన్నారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ వనస్థలిలో ఉన్న రాస్ కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీ వి.సుమతి అధ్యక్షత వహించారు. శివనారాయణ మాట్లాడుతూ ప్రధాన పంటలలో వ్యవసాయ యాంత్రీకరణపై అవగాహన కల్పించాలన్నారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డా.ఎస్.శ్రీనివాసులు 2024–25 సంవత్సరంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ ఏడాది చేపట్టిన కార్యక్రమాలు, 2025–26 సంవత్సరానికి చేపట్టబోయే కార్యక్రమ ప్రణాళికను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డా.బి.గోవిందరాజులు, తిరుపతి ఎస్‌వీ పశుసంవర్థక విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు ఎస్.శోభామణి, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న శివనారాయణ
![ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06skht202a-300084_mr-1738872944-1.jpg)
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment