![‘పేట’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06slp101-410018_mr-1738872945-0.jpg.webp?itok=4-DetlAD)
‘పేట’లో రామాంతపురం ఎక్స్ ప్రెస్
నాయుడుపేటటౌన్: రామేశ్వరానికి వెళ్లే ప్రయాణికులకు అనువుగా నాయుడుపేటలో రామాంతాపురం ఎక్స్ ప్రెస్ రైలును నిలుపుదల చేస్తున్నట్టు సదరన్ రైల్వే ప్యాసింజెర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీజూరు మస్తానయ్య, డీఆర్‌యూసీసీ సభ్యులు పేర్నాటి జోసఫ్ తెలిపారు. గురువారం నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో మొదటి సారిగా నిలుపుదల చేసిన రామాంతపురం ఎక్స్ ప్రెస్ రైలును పూలతో అలంకరించి లోకో పైలెట్‌లకు పూల మాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గురువారం ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 8.15 గంటలకు నాయుడుపేటకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కన్నీటి నివాళి
పెళ్లకూరు: మండలంలోని జీలపాటూరు గ్రామానికి చెందిన 9వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మగ్గం నరసయ్య(35) అంత్యక్రియలను గురువారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. 40 రోజుల కిందట నాయుడుపేటకు చెందిన పార్వతిని వివాహం చేసుకున్న ఆయన బుధవారం గ్రామంలో జరిగిన పోలేరమ్మ జాతరలో పాల్గొన్నాడు. అదే సమయంలో ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయి హఠన్మరణం చెందిన విషయం తెలిసిందే. 9వ బెటాలియన్ ఆధ్వర్యంలో అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించారు. నరసయ్య మృతి విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకొని రోదించారు. ఇక నాకు దిక్కెవరంటూ భార్య పార్వతి గుండెలు బాదుకుంటూ కన్నీళ్లు పెట్టడం అక్కడివారిని కలచివేసింది.
![‘పేట’లో రామాంతపురం ఎక్స్ ప్రెస్ 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06slp64-410015_mr-1738872945-1.jpg)
‘పేట’లో రామాంతపురం ఎక్స్ ప్రెస్
Comments
Please login to add a commentAdd a comment