![పరీక్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10stvd34-300071_mr-1739218087-0.jpg.webp?itok=61THJWc6)
పరీక్ష పే చర్చ పరిశీలన
చంద్రగిరి: ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని సోమవారం అధికారులు పరిశీలించారు. సమగ్ర శిక్ష జిల్లా ఏఎంఓ శివశంకరయ్య, ఏఎస్‌ఓ సారథి, ఎంఈఓలు భాస్కర్‌బాబు, లలిత కుమారి స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విద్యార్థులతో కలసి వీక్షించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీఫైనల్ పరీక్షలను పర్యవేక్షించారు. అలాగే అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మండల వైద్యాధికారులు కుసుమ, డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఎంపీడీఓ శేఖర్ బాబు, హెచ్‌ఎం వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
బాడీ బిల్డర్‌కు బంగారు పతకం
వరదయ్యపాళెం: వరదయ్యపాళెం మండలం, అకిసింపాళెంకు చెందిన బాడీ బిల్డర్ వెట్టి శివాజీ రాష్ట్రీయ దేహదారుఽఢ్య పోటీల్లో మరోమారు సత్తా చాటారు. శ్రీకాకుళం నగరంలో పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రీయ దేహదారుఽఢ్య పోటీల్లో వెట్టి శివాజీ 85 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 మంది బాడీ బిల్డర్లు ఈ పోటీల్లో పాల్గొనగా వెట్టి శివాజీ బంగారు పతకంతో పాటు మిస్టర్ ఆంధ్ర టైటిల్ విన్నర్ సొంతం చేసుకున్నాడు. గతంలో కూడా బాడీ బిల్డర్ వెట్టి శివాజీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మిస్టర్ యూనివర్స్ వంటి పతకాలను కై వసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో 33వ సారి మిస్టర్ ఆంధ్ర టైటిల్‌ను కై వసం చేసుకున్న శివాజీని పలువురు ప్రశంసించారు.
![పరీక్ష పే చర్చ పరిశీలన 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10cdr41-300073_mr-1739218087-1.jpg)
పరీక్ష పే చర్చ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment