![రైల్వ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11tpthead_mr-1739300485-0.jpg.webp?itok=1vstDU7c)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
ద్విచక్ర వాహనాల బహూకరణ
తిరుమల శ్రీవారికి రెండు ద్విచక్ర వాహనా లను బహూకరించారు. ఈ మేరక తాళాలను టీటీడీ అదనపు ఈఓకు అందజేశారు.
రైల్వే ట్రాక్‌పై పనిచేస్తున్న సమయంలో అకస్మాత్‌గా ట్రైన్ రావడంతో ఓ గ్యాంగ్ మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు.
బుధవారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
ట్రాక్టర్ ఇసుక రూ.1,400
రేణిగుంట మండలం, జీపాళెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకను శ్రీకాళహస్తికి చెందిన ఓ టీడీపీ నాయకుడు, రేణిగుంటకు చెందిన ఇద్దరు ముఖ్యనాయకులు కలసి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్దపెద్ద గోతులు తవ్వేశారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.1,400 కట్టితే మనుషులతో, చీకటి పడితే జేసీబీల సాయంతో లోడ్ చేస్తారు. ఎక్కడికి తోలుకున్నా ఆపేవారుండరు. దీంతో తెల్లవారకముందు నుంచి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్లు, లారీలు క్యూకడుతున్నాయి. రోజుకు రూ.2 లక్షలకు పైగా వసూలు చేసి వాటాలు పంచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. దీంతో గ్రామస్థులు అడ్డుకుంటే భౌతికదాడి చేస్తారేమోనని భయాందోళన చెందుతున్నారు.
రేణిగుంట మండలం, జీపాళెం సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు
పవిత్ర స్వర్ణముఖీ నది శోకిస్తోంది. అధికార మాఫియా ముసుగులో రాత్రింబవళ్లు ఇసుక తవ్వి తరలిస్తున్నా ప్రశ్నించే గొంతుక కరువైంది. అడ్డు చెప్పే అధికారి కానరాని పరిస్థితి నెలకొంది. అక్రమ వ్యాపారం రంకెలేస్తూ పరుగులు పెడుతోంది. పచ్చ మూకల ధనదాహానికి అంతేలేకుండా పోయింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకతోడేళ్లు రాత్రింబవళ్లు స్వర్ణమ్మను చెరబడుతున్నా యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడనంటోంది.
రేణిగుంట: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇసుక తోడేళ్లు రెచ్చిపోతున్నాయి. అధికార ముసుగులో చెలరేగిపోతున్నాయి. ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాయి. రాత్రింబవళ్లూ లేకుండా తవ్వేస్తున్నాయి. వేల కొద్దీ ట్రక్కుల ఇసుక అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈ తతంగం నడిపిస్తుండడంతో అధికారులెవ్వరూ అటువైపు కనెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నియోజకవర్గమంతటా ఇదే పరిస్థితి
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రధానంగా స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. ఈ నది మీదే వందలాది గ్రామాల ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. తాగు, సాగునీరు అందిస్తున్న స్వర్ణమ్మను కూటమి నాయకులు చెరబడుతున్నారు. రేణిగుంట మండలం కొట్రమంగళం, గాజులమండ్యం, తూకివాకం, పిల్లపాళెం, జీపాళెంలో ఇష్టారాజ్యంగా ఇసుక తోడేస్తున్నారు. అలాగే ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేట, ఎండీ పుత్తూరు, కొత్తవీరాపురం, శ్రీకాళహస్తి మండలంలోని రామాపురం, సుబ్బానాయుడుకండ్రిగ, వేడం, చుక్కలనిడిగల్లు, తొట్టంబేడు మండల పరిధిలోని విరూపాక్షపురం, బసవయ్యపాళెం, కన్నలి తదితర గ్రామాల నుంచి నిత్యం ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
రెచ్చిపోతున్న ఎమ్మెల్యే అనుచరులు
సహజవనరులను కొల్లగొట్టి..
నోట్ల కట్టలు వెనకేస్తున్న నేతలు
స్వర్ణమ్మ శోకిస్తున్నా కన్నెత్తి చూడని
అధికారులు
మానని గాయం..ఆగని తవ్వకం!
2021, డిసెంబర్, 19న జీపాళెం దళితవాడకు చెందిన కాకి నాగరాజు కుమారుడు ధోని(16), కాకి వెంకటసుబ్బయ్య అలియాస్ సుబ్బారావు కుమారుడు యుగంధర్(14), పీ.జయశంకర్ కుమారుడు గణేష్(15), లోకేష్ కుమారుడు లిఖిత్ సాయి(14)లో కలసి ప్రిడ్జ్‌కి వచ్చే థర్మాకోల్‌ను తీసుకుని గ్రామ శివారున ఉన్న స్వర్ణముఖి నదిలోకి వెళ్లారు. బెండులపై ఇద్దరు చొప్పున కూర్చొని వాగులోకి వెళ్లారు. నది మధ్యలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు బెండ్లు తిరగబడ్డాయి. ధోని, యుగంధర్, గణేష్ నీటిలో మునిగిపోయారు. సమీపంలో చేపలు పడుతున్న లక్ష్మమ్మ అనే మహిళ లిఖిత్‌సాయిని కాపాడారు. నాలుగేళ్లు గడుస్తున్నా.. ఆ ఊర్లోని వారు ఆరిన దీపాలను తలచుకుంటూ కన్నీటి చుక్క జారవిడుచుకుని రోజులు గడుపుతున్నారు. అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బాధితులకు బాసటగా నిలిచారు. ఇసుక ఎత్తనివ్వకుండా అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుకను జేసీబీలు పెట్టి మరీ ఇసుక తవ్వేస్తున్నారు. ట్రాక్లర్లు, లారీలలో నింపుకుని తిరుపతి, చైన్నె, బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
కన్నీటి సుడులే
మూడేళ్ల కిందట నా బిడ్డ గణేష్‌ను స్వర్ణముఖీ నది తనలో కలిపేసుకుంది. మాకు పుత్రశోకాన్ని మిగిల్చింది. మా ఆశలకు ప్రతిరూపమైన కన్న పేగును పోగొట్టుకుని మేము పడుతున్న వేదన పగవారికి కూడా రాకూడదు. నదిలో ఇసుక తవ్వేయడం వల్ల ఏర్పడిన గుంతల్లో కూరుకుపోయి మా గ్రామానికి చెందిన ముగ్గురు బిడ్డలు చనిపోయారు. వాళ్లు ప్రాణాలు విడిచిన చోటే మళ్లీ ఇసుక లోడుతున్నారు. ఇంకెంత మంది ప్రాణాలు పోవాలో తెలియడంలేదు. దీనికి అంతం లేదా?. – మృతుడు గణేష్ తల్లి జయలక్ష్మి,
జీపాళెం దళితవాడ
ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి?
నాలుగేళ్లు కట్టుగా ఇసుక రేణువు ఎత్తనివ్వకుండా నిలువరించాం. ఇప్పుడు కట్టు తప్పింది. గత 20 రోజులుగా జీపాళెం సమీపంలో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేదు. మీ ధనదాహానికి ఇంకెన్ని ప్రాణాలు మట్టిలో కలవాలి..?.
– మునికృష్ణారెడ్డి, జీపాళెం
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/06skht218-300084_mr-1739300485-1.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/hello1_mr-1739300485-2.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
3](https://www.sakshi.com/gallery_images/2025/02/12/kabja2_mr-1739300485-3.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
4](https://www.sakshi.com/gallery_images/2025/02/12/06skht223-300084_mr-1739300486-4.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
5](https://www.sakshi.com/gallery_images/2025/02/12/06skht212-300084_mr-1739300486-5.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
6](https://www.sakshi.com/gallery_images/2025/02/12/06skht224-300084_mr-1739300486-6.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
7](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11skht02-300131_mr-1739300486-7.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
8](https://www.sakshi.com/gallery_images/2025/02/12/06skht226-300084_mr-1739300486-8.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
![రైల్వే గ్యాంగ్ మన్ మృతి
9](https://www.sakshi.com/gallery_images/2025/02/12/06skht227-300084_mr-1739300486-9.jpg)
రైల్వే గ్యాంగ్ మన్ మృతి
Comments
Please login to add a commentAdd a comment