![గ్రీవెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11tpl57-300079_mr-1739300488-0.jpg.webp?itok=g8raPBun)
గ్రీవెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి
తిరుపతి అర్బన్: అన్ని విభాగాలకు చెందిన అధికారులు గ్రీవెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల, డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ చేపట్టాలని చెప్పారు. సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని ఆదేశించారు. గ్రీవెన్స్ నిర్వహించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు జిల్లా అధికారులు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్‌మాండ్, డీపీఓ సుశీలాదేవి, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ వై.సుమతి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ వసంత బాయి, ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రనాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment