![హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/ttd_mr-1739300430-0.jpg.webp?itok=hroc2o-4)
హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తిరుమల: టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా నేర్చుకున్న ప్రతి విషయాన్ని భక్తుల్లోకి తీసుకెళ్లాలని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరి సూచించారు. తిరుమలలో బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం ఆస్థాన మండపంలో మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు ఈఓ భక్తులనుద్దేశించి ప్రసంగించారు. 1979లో టీటీడీ ప్రారంభించిన దాస సాహిత్య ప్రాజెక్టు సంకల్పం పరిపూర్ణమై ప్రజల్లోకి వెళ్లిందని చెప్పారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఒక్కసారి మెట్లోత్సవంలో పాల్గొంటే 108 సార్లు స్వామివారిని దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందన్నారు. ప్రవచనకర్త హయగ్రీవాచార్యులు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment