![జాతీయ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10tpl13-300115_mr-1739218088-0.jpg.webp?itok=6RKjJ7-g)
జాతీయ సదస్సు ప్రారంభం
తిరుపతి సిటీ: హైదరాబాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ సహకారంతో మహిళా విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల జాతీయ సదుస్సు సోమవారం ప్రారంభమైంది. అడ్వాన్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ‘పేటెంట్ అప్లికేషన్ డ్రాఫ్టింగ్, ఫైలింగ్’ విధానాలపై జరిగిన ఈ సదస్సుకు ముఖ్యఅతిథిలుగా వీసీ ప్రొఫెసర్ ఉమ, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ప్రొగ్రాం డైరెక్టర్ స్వప్న హాజరయ్యారు. భారతదేశంలోని ఎంట్రపెన్యూర్స్ విషయంలో పేటెంట్ చట్టాలు, నిబంధనలు, ఫైలింగ్ ప్రాసెస్ వంటి అంశాలతో పాటు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పథకాలుపై అవగాహన కల్పించారు. సదస్సులో రిజిస్ట్రార్ రజిని, పలు రాష్ట్రాల నుంచి విచ్చేసి రిసోర్స్ పర్సన్లు హాజరయ్యారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 27 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,536 మంది స్వామివారిని దర్శించుకోగా 25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.67 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
రామకృష్ణ తీర్థానికి పటిష్ట భద్రత
తిరుమల: తిరుమలలో బుధవారం జరగనున్న రామకృష్ణ తీర్థానికి పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఎంతమంది భక్తులు వస్తున్నారో ముందుగానే అంచనా వేయాలన్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
![జాతీయ సదస్సు ప్రారంభం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/sp_mr-1739218088-1.jpg)
జాతీయ సదస్సు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment