అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

Published Tue, Feb 11 2025 1:48 AM | Last Updated on Tue, Feb 11 2025 1:48 AM

అంతర్

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

‘లక్కు’..కిక్కు!
జిల్లాలో గీత కార్మికులకు లాటరీ పద్ధతిలో 23 మద్యం దుకాణాలు కేటాయించారు. ఇవి నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

సిలికా.. మెలిక!

పట్టా భూముల్లో సిలికా తవ్వకాలకు కూటమి నేత లు వెంపర్లాడుతున్నారు. సాగు భూములను ఎడారిగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు.

మంగళవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

కూటమి ప్రభుత్వంలో..

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా, ఏరియా, గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలను గాలికి వదిలేశారు. గడిచిన ఆరు నెలలుగా పూర్తి స్థాయిలో మందులు సరఫరా చేయకుండా చేతులెత్తేశారు. ఇంటికి వెళ్లి వైద్యం అందించడం దేవుడెరుగు.. ఆస్పత్రికి వస్తే కనీసం అవసరమైన మందులు కూడా లేకుండా చేశారు. బీపీ, షుగర్‌, ఇన్సులెన్‌ లాంటి అత్యవసర మందులూ అందించకుండా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో పేద రోగులు అప్పూసప్పూ చేసి ప్రయివేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో..

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేశారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఆధునిక ల్యాబ్‌లను తీసుకొచ్చారు. బీపీ, షుగర్‌, రక్తం, యూరిన్‌ పరీక్షలతోపాటు ఈసీజీ లాంటి సేవలను ఉచితంగానే అందించారు. 180 రకాల మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. షుగర్‌ పేషెంట్లకు ఇన్సూలిన్‌తో పాటు మందులు ఉచితంగా ఇంటి వద్దకే వెళ్లి అందించేలా చొరవ చూపారు. ఆరోగ్య సురక్ష కేంద్రాల పేరుతో మెగా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజారోగ్యానికి మెరుగులు అద్దారు. వారంలో మూడు రోజులు ఫిజీషియన్‌తో పాటు స్పెషలిస్ట్‌ డాక్టర్లను ఆస్పత్రుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

తిరుపతి రుయా ఆస్పత్రిలో మందుల కోసం రోగుల పడిగాపులు

కిట్లు లేవంటున్నారు

గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్యం అందడం లేదు. వైద్య పరీక్షల కోసం ఇక్కడికి వెళ్తే కిట్లు లేవని పంపించేశారు. లివర్‌, కిడ్నీ, గుండె ఫంక్షనింగ్‌ ఏడాది క్రితం చేసుకున్నా. మరోసారి చేసుకుందామంటే వాటికి సంబంధించినవి లేవు అని వెనక్కి పంపించేశారు. దగ్గు వస్తుండడంతో పిల్లల్ని తీసుకెళ్లాను. దగ్గు మందు కూడా లేదని చెబు తున్నారు. – వెంకటయ్య, మైలవరం గ్రామం,

దొరవారిసత్రం, తిరుపతి జిల్లా

మందులు లేవంట

జ్వరం, దగ్గు, తలనొప్పి ఎక్కువగా ఉండడంతో రుయా ఆస్పత్రికి వచ్చాను. వైద్యులు చూసి మందులు రాశారు. మందులు తీసుకునేందుకు వెళ్లగా ఆరు రకాలలో కేవలం రెండు రకాల మందులు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి బయట మెడికల్‌ షాపులో కొనుక్కోవాలని చెప్పారు. ముందే తెలిసి ఉంటే ఊరిలోనే వైద్యం చేయించుకునే దాన్ని. గతంలో మాకు ఇంటి వద్ద వైద్యం అందించే వాళ్లు. ఇప్పుడు ఆస్పత్రులకు వచ్చినా ఫలితం లేకుండా పోతోంది. –గురవమ్మ, బొప్పరాజు పల్లి

కొన్ని మందులే ఇచ్చారు

నాకు బీపీ, షుగర్‌ ఉన్నాయి. గ్రామానికి నెలకు ఒకసారి వచ్చే 104 వాహనంలోని వైద్యుల ద్వారా పరీక్షించుకొని మందులు నెలకి సరిపడా తీసుకుంటాను. ఈనెల పరీక్షలు చేయించుకొని పూర్తి మందులు లేవని కొన్ని రకాలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన మందులు, వచ్చిన పెన్షన్‌ డబ్బులు నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది.–అన్నపూర్ణమ్మ, కమ్మవారిపాళెం,

చిల్లకూరు మండలం

మందుల కొరత లేకుండా చూస్తున్నాం

ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నాం. ఆయా ఆస్పత్రుల నిధుల నుంచి కొనుగోలు చేసుకునేలా చర్యలు చేపట్టాం. ల్యాబ్‌లను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వైద్యుల పనితీరును పర్యవేక్షిస్తున్నాం.

–డాక్టర్‌ బాలకృష్ణనాయక్‌, డీఎంహెచ్‌ఓ, తిరుపతి జిల్లా

‘నులి’ నివారణే లక్ష్యం

తిరుపతి తుడా: నులి పురుగుల నివారణే లక్ష్యమని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీఏ.చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం ఎస్వీ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పిల్లల కడుపులో నులి పురుగులు ఏర్పడితే పోషకాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని తెలిపారు. శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలు కనబడతాయన్నారు. అలాంటి పిల్లలకు ఆల్బెండజోల్‌ 400 ఎమ్‌జీ మాత్రను వేయాలని సూచించారు. సామాజిక శాస్త్ర విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివకళ, డాక్టర్‌ మధుసూదన్‌ రెడ్డి, బాలసుబ్రమణ్యం, పీఆర్‌ఓ కిరణ్‌ పాల్గొన్నారు.

ప్రాక్టికల్స్‌కు

101మంది గైర్హాజరు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : సీనియర్‌ ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు సోమవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లలో నిర్వహించిన ప్రాక్టికల్స్‌ పరీక్షకు 101 మంది గైర్హాజరయ్యారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 94 పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు 4,278 మంది హాజరుకావాల్సి ఉండగా వారిలో 73 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 91 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు 3,143 మందికి గాను 28 మంది గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు

తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మొత్తం 95 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఇతర ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

తిరుపతి తుడా: జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. విష జ్వరాలు, దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవుతున్నారు. మొత్తం జనాభాలో 40 శాతం మంది వ్యాధులబారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రయివేటు క్లినిక్‌లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తగ్గట్టే జిల్లా, ఏరియా, గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అవసరమైన మందులు, ల్యాబ్‌లో పరికరాలు లేకపోవడంతో వైద్యులు చేతులెత్తేస్తున్నారు.

యాంటీబయోటిక్‌ మందులూ కరువే

రోగులకు అందించే యాంటీబయోటిక్స్‌ మాత్రలు, ఇంజక్షన్లు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. గాయాల బారిన పడిన వారికి ఇన్ఫెక్షన్‌ అవ్వకుండా ఉండేందుకు ఇచ్చే ఇంజక్షన్లు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో దొరకడంలేదు. అలాగే యాంటీబయోటిక్‌ సెఫాజిన్‌, సేఫ్టిట్రాయాగ్జెన్‌, పరగడుపున వేసుకునే పాంటా ప్రజోల్‌, ఫ్లూయిడ్స్‌ మెట్రో జెల్‌, లివర్‌, గ్యాస్‌ సంబంధిత అల్రెక్టోన్‌ 25 ఎంజీ, కాండివాస్‌ వంటి మందులతోపాటు రక్తంలో ప్లేట్లెట్లు తగ్గినప్పుడు వేసుకునే మందులు, క్యాన్సర్‌ మందులు, శస్త్ర చికిత్సకు ఉపయోగించే సర్జికల్‌ సామగ్రి, నీడిల్స్‌ సైతం అరాకొరగానే ఉన్నట్టు సమాచారం.

తిరుపతి సిటీ: ఎస్వీయూ రాజనీతి శాస్త్రం, ప్రజా పరిపాలన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను వర్సిటీ ఉపకులపతి ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్‌ ఆచార్య భూపతి నాయుడు చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో జరగనున్న సదస్సుకు వివిధ దేశాల పరిశోధకులు, మేధావులు తమ పరిశోధక పత్రాలను సమర్పించనున్నారని సదస్సు సంచాలకుడు ఆచార్య బీవీ మురళీధర్‌ తెలిపారు. డాక్టర్‌ పత్తిపాటి వివేక్‌, డాక్టర్‌ పాకనాటి హరికృష్ణ, ఎస్వీయూ ఆర్ట్స్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ భాస్కర్‌ రెడ్డి, ఆచార్యులు వెంకటేశ్వర్లు, నారాయణ పాల్గొన్నారు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం

ప్రభుత్వాస్పత్రుల్లో వేధిస్తున్న

మందుల కొరత

ఆరు నెలలుగా ఇదే పరిస్థితి

అవస్థలు పడుతున్న పేద రోగులు

జిల్లాలో నో మెడిసిన్‌

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. హై షుగర్‌ వ్యాధి గ్రస్తులకు ఇచ్చే ఇన్సూలిన్‌ కొరత రోగులను వెంటాడుతోంది. దీర్ఘకాలిక వ్యాధి కావడంతో గత ప్రభుత్వం ఇన్సూలిన్‌ను ఉచితంగా ఇంటి వద్దకే వెళ్లి బాధితులకు వేసేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తిపలికింది. అలాగే బీపీ బాధితులకు యాం లోడిపిన్‌, అటన్‌ అలాల్‌ వంటి మందులు, అలానే దగ్గుకు ఇచ్చే యాంబ్రాక్సాల్‌, అజిత్రోమైసిన్‌, అమాక్సిలిన్‌, ఆస్మా పేషెంట్లకు ఇచ్చే ఇన్హేలర్స్‌, రస్ఫ్యూల్స్‌, సిరప్‌ల సరఫరా పూర్తిగా ఆగిపోయింది. వివిధ అనారోగ్య సమస్యలకు అందించే బి కాంప్లెక్స్‌ మాత్రలు సైతం పూర్తి స్థాయిలో అందడంలేదు. అలాగే చర్మ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఆయిట్మెంట్ల కొరత ఎక్కువగా ఉంది.

జిల్లా సమాచారం

జిల్లా ఆస్పత్రి : రుయా

రోజు వారి ఓపీలు: 900-1,200

ఏరియా ఆస్పత్రులు: రెండు

ఓపీలు: 150-200

పట్టణ ఆరోగ్య కేంద్రాలు: 26

ఓపీలు: 70-90

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు: 60

ఓపీలు: 100-150

దయనీయస్థితిలో ల్యాబ్‌లు

వివిధ రకాల రక్త, యూరిన్‌ పరీక్షలతో పాటు తరచూ కిడ్నీ, గుండె ఫంక్షనింగ్‌, షుగర్‌ నిర్థారణ కోసం నిర్వహించే ఎఫ్బీఎస్‌, పీపీబీఎస్‌ పరీక్షలను కూడా చేయలేని స్థితిలో ఆరోగ్య కేంద్రాలు నిర్వీర్యమయ్యాయి. అలానే సీవీసీ, ఆర్‌ఎఫ్‌టీఎల్‌ఎఫ్‌టీ, సీరం ఎలక్ట్రోలైట్‌ వంటి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి లేకపోవడంతో ల్యాబ్‌లు వెలవెలబోతున్నాయి. తరచూ నిర్ధారించుకునే షుగర్‌, కిడ్నీ, హార్ట్‌, లివర్‌ ఫంక్షనింగ్‌ పరీక్షల కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ల్యాబ్‌లో పనులు లేక టెక్నీషియన్లు కుర్చీలకే పరిమితమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ1
1/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ2
2/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ3
3/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ4
4/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ5
5/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ6
6/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ7
7/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ8
8/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ9
9/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ10
10/10

అంతర్జాతీయ సదస్సు పోస్టర్ల ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement