అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

Published Tue, Feb 11 2025 1:48 AM | Last Updated on Tue, Feb 11 2025 1:48 AM

అర్జీ

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

● పీజీఆర్‌ఎస్‌కు 249 అర్జీలు ● సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున వినతులు

తిరురతి అర్బన్‌: అర్జీదారులతో కలెక్టరేట్‌ కిక్కిరిసింది. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు జిల్లా నలుమూలల నుంచి 249 అర్జీలు వచ్చినట్టు జేసీ శుభం బన్సాల్‌ తెలిపారు. అందులో 155 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రమంతప్పకుండా ప్రతి విభాగానికి చెందిన జిల్లా అధికారి హాజరు కావాలన్నారు. అలాగే అర్జీల పట్ల నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు.

అర్జీదారుల అగచాట్లు

కలెక్టరేట్‌లో అధికారులు క్యూ పద్ధతిని కచ్చితంగా పాటించడంతో ముందుగా వచ్చిన వారు ముందుగానే అధికారులను కలవడానికి అవకాశం దక్కింది. అయితే వేచి ఉండడానికి అవసరమైన కుర్చీలను ఏర్పాటు చేయకపోవడంతో టోకెన్‌ కౌంటర్‌ వద్ద కిందే కూర్చోవాల్సి వచ్చింది. దీంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడడం కనిపించింది. కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్‌, శివశంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

కుండలు తయారీతోనే జీవనం

శ్రీకాళహస్తి మండలం, ఇనగలూరు గ్రామంలో 50 కుటుంబాలకు పైగా కుమ్మరి కులానికి చెందిన వారు ఐదు దశాబ్దాలుగా కుండలు తయారీ చేస్తూ జీవనం సాగిస్తున్నాయని రాష్ట్ర కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య తెలిపారు. ఈ క్రమంలో కుండల తయారీకి అవసరమైన మట్టిని సమీప ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటున్నారని వెల్లడించారు. అయితే స్థానిక రెవెన్యూ ఉద్యోగులు ఆ మట్టిని తొలిగించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన చెందారు. దీంతో వారి పోషణకు భంగం కలుగుతోందని వాపోయారు. న్యాయం చేయాలంటూ జేసీకి వినతిపత్రాన్ని అందించారు. జిల్లా కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ చెలికం నాగరాజురెడ్డి, స్థానికులు చిల్లకూరు శివకృష్ణ, ముచ్చేలి బాలకృష్ణ, ముచ్చేలి శంకరయ్య పాల్గొన్నారు.

కుర్చీలు లేక టోకెన్‌ కౌంటర్‌ వద్ద కొందరు నిలబడి, మరి కొందరు కింద కూర్చున్న వైనం

పింఛన్‌ ఇప్పించండి బాబూ

తమకు పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలంటూ తిరుపతిలోని సత్యనారాయణపురానికి చెందిన జీ.యశోద అనే విభిన్న ప్రతిభావంతురాలు అధికారులను వేడుకున్నారు. అనారోగ్యం నేపథ్యంలో తమ నివాసం నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌కి రాలేకపోతున్నానని వాపోయారు. తన భర్త నరసింహులు నాయుడు మృతి చెందారని పేర్కొన్నారు. దీనికితోడు అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులకు, పోషణకు ఆర్థిక భారంతో తిప్పులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఫించన్‌ ఇస్తే చాలు బాబు.. అంటూ ఆ మేరకు జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.

ఆగదు ఈ పోరాటం!

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని వెటర్నరీ కళాశాల జూడాలు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. జూడాలు మాట్లాడుతూ వెటర్నరీ విద్యను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తప్పుబట్టారు. వెటర్నరీ విద్య ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. వైద్యవిద్యతో సమానమైనదని చెప్పారు. మరోవైపు 13 ఏళ్లుగా స్టైఫండ్‌ యూజీ విద్యార్థులకు రూ.7వేలు, పీజీ విద్యార్థులకు రూ.9 వేలు ఇస్తున్నారని, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను గుర్తుంచుకుని యూజీ విద్యార్థుల రూ.10 వేలు, పీజీ విద్యార్థులకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అధికారులకు అర్జీ అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌ 
1
1/5

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌ 
2
2/5

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌ 
3
3/5

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌ 
4
4/5

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌ 
5
5/5

అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement