పంచాయతీలో మోగిన సమ్మె సైరన్
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): రేణిగుంట పంచాయతీలో సమ్మె సైరన్ మోగింది. నెలలు గడుస్తున్నా న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోవడంతో మంగళవారం నుంచి రేణిగుంట పంచాయతీలోని అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రేణిగుంట మేజర్ పంచాయతీలో అన్ని విభాగాల్లో కలిపి 120 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పంచాయతీ కార్మికులకు రావలసిన వేతన బకాయిలు, ఈసీపీఎఫ్, యూనిఫామ్, సోపు, నూనెతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని మూడు నెలలుగా పంచాయతీ ఈఓ మణిని కోరుతున్నారు. కానీ సమస్యలను పరిష్కరించకపోవడంతో ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఫిబ్రవరి 1న అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. పది రోజులు గడువు ఇచ్చిన అధికారులు స్పందించకపోవడంతో సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. మంగళవారం ఉదయం అన్ని విభాగాల పంచాయతీ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టనున్నట్టు ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి మణి తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు విధుల్లోకి ఏ ఒక్క కార్మికుడూ వెళ్లరని తేల్చిచెప్పారు. ఏఐటీయూసీ మండల కార్యదర్శి కార్తీక్, అధ్యక్షుడు అబ్దుల్ రజాక్, సీపీఐ మండల కార్యదర్శి మోహన్‌రెడ్డి, భవన నిర్మాణ సంఘం కార్యదర్శి సెల్వ, పంచాయతీ కార్మిక నాయకుడు సుబ్బరాజు పాల్గొన్నారు.
మృత్యుంజయ స్వామికి ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గణపతిపూజ, కలశ స్థాపన పూజలు చేశారు. అనంతరం స్వామివారికి చందనం, నారికేళ్లం, పసుపు, కుంకుమ, విభూధి వంటి వాటితో అభిషేకాలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment