లైడార్ సర్వే ప్రారంభం
కొడంగల్: కొడంగల్ కేంద్రంగా మంగళవారం లైడార్ సర్వే ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ కొడంగల్‌కు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ సమాంతరంగా రైల్వే లైన్ వేయనున్నారు. రోడ్డు మార్గంతో పాటు రైల్వే లైన్ వేయడానికి హెలికాప్టర్ ద్వారా సర్వే చేస్తున్నారు. భూమి పైభాగంతో పాటు లోపల ఉన్న వాటిని లై డిటెక్టర్ వ్యవస్థ ద్వారా గుర్తిస్తారు. దీని కోసం లైడార్ సర్వే చేపట్టారు. కొడంగల్‌లో హెలిప్యాడ్ ఉన్నందున కొడంగల్ కేంద్రంగా మూడు రోజుల పాటు ఈ సర్వే చేయనున్నారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు 564 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంటుందని ఆర్‌వీ ఆసోసియేట్స్ ప్రతినిధులు తెలిపారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, భవనగిరి, యాదాద్రి, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్‌లను కలుపుతూ తిరిగి వికారాబాద్‌కు చేరుకుంటుందని సమాచార. సమీప భవిష్యత్‌లో వికారాబాద్ జిల్లా వాసులకు రవాణా వ్యవస్థ మరింత మెరుగు పడే అవకాశం ఉంది. రోడ్డు మార్గంతో పాటు రైల్వే మార్గం కూడా అందుబాటులోకి రానుంది.
ట్రిపుల్ ఆర్‌కు సమాంతరంగా రైల్వే లైన్
564 కిలో మీటర్ల దూరం
జిల్లా మీదుగా సర్వే
Comments
Please login to add a commentAdd a comment