గచ్చిబౌలి: రెండో దశ పనులు పూర్తయితే నగరం నలువైపులా మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో మెట్రో రైలు ప్రయాణికుల కోసం ఆర్‌సీఎస్ గూగుల్ వాలెట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. రెండో దశ పనులు వేగంగా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకొని సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ అన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రస్తుతం రోజుకు మెట్రో రైళ్లు 1,100 ట్రిపులు నడుపుతున్నామని, నాగపూర్ భాగస్వామ్యంతో కొత్త రైళ్లు తీసుకొస్తామని వివరించారు. ప్రయాణికుల కోసం రూట్ మొబైల్, గూగుల్ వాలెట్, మెట్రో రైలు సంయుక్తంగా డిజిటల్ వాలెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. డిజిటల్ వాలెట్‌లో మెట్రో రైలుకు ఎక్కడి వెళ్లాలో చూపిస్తుందని, ఆటోమెటిక్‌గా పేమెంట్ చేయవచ్చన్నారు. యాపిల్ ఫోన్‌తో పాటు అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్లతో ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. ఫిజికల్‌గా టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చారు. కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ హెర్‌ఆర్‌ఎంఎల్ సీఈఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని రూట్లూ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానం
గూగుల్ వ్యాలెట్‌ను ఆవిష్కరించిన ఎన్వీఎస్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment