బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Published Wed, Nov 6 2024 6:34 AM | Last Updated on Wed, Nov 6 2024 6:34 AM

-

పూడూరు: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిట్ట పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మన్నెగూడలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం బాగుండాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టంగా మారాలంటే మెజార్టీ స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో యాభై శాతం కేంద్రం వాటా ఉంటుందని గుర్తు చేశారు. కేంద్రం ఇస్తున్న పథకాలను తామే ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సినిమా సెన్సార్‌ బోర్డు సభ్యుడు మల్లేష్‌ పటేల్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు సుభాన్‌ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరమేశ్వర్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement