నమ్మకమైన సిమెంట్‌కు కేరాఫ్ సీసీఐ
అనంతగిరి: ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ సిమెంట్ నమ్మకమైనదని ఢిల్లీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అలోక్ శుక్లా అన్నారు. గురువారం వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో సీసీఐ సిమెంట్ డీలర్లు, సబ్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐకి జిల్లాలోని తాండూరులో మూడు ఆపరేటింగ్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, హిమాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోనూ సీసీఐ సేవలందిస్తోందని తెలిపారు. 1987లో తాండూరు సమీపంలోని కరన్‌కోట్‌లో కంపెనీలు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో ఆర్డినరీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ (ఓపీసీ), పోట్టోలోనా పోర్ట్ ల్యాండ్ సిమెంట్ (పీపీసీ) తో సహాఅన్ని రకాల అధిక నాణ్యత కలిగిన సిమెంట్‌ను తయారు చేస్తోందని వివరించారు. భారతీయ రైల్వేల కోసం కాంక్రీట్ స్లీపర్ల ఉత్పత్తిలో ఉపయోగించే ప్రత్యేక గ్రేడ్ సిమెంట్ అయిన ఓపీసీ 535ను కూడా ఉత్పత్తి చేస్తోందన్నారు. మన మార్కెట్లలో సీసీఐని ప్రోత్సహించిన రిటైలర్లు, డీలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఐ జనరల్ మేనేజర్ శరత్ కుమార్, రీజినల్ మేనేజర్ ఉమేష్ కుమార్ సింగ్, సీనియర్ మేనేజర్ దివాకర్ శ్రీవాస్తవ, సీనియర్ మేనేజర్ పాండే, మేనేజర్ ఆఫీసర్లు పి.వెంకట్రాములు, రోహిత్ మిశ్రా, అసిస్టెంట్ ఆఫీసర్లు దేవరాజ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అలోక్ శుక్లా
సంస్థ డీలర్లు, సబ్ డీలర్లతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment