రాత పరీక్ష రద్దు చేయాలి
అనంతగిరి: కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు రాత పరీక్ష రద్దు చేసి, అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. గురువారం కాంట్రాక్టు ఏఎన్‌ఎంల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట 48గంటల నిరవధిక సమ్మె చేపట్టారు. రాత్రి వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా గ్రామాల్లో, పీహెచ్‌సీలలో ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారని వెల్లడించారు. అందరికీ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లీలావతి, లలిత, వెంకటమ్మ, కవిత, వెంకటమ్మ, రోజా, భారతి, రజియా, చంద్రకళ, మల్లమ్మ, అని త, యాదమ్మ, సత్యమ్మ, పద్మ, సుజాత, జయశీల, స్వరూప, చంద్రకళ, రాములమ్మ పాల్గొన్నారు.
● ఏఎన్‌ఎంలనుప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి మైపాల్
Comments
Please login to add a commentAdd a comment